పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంతో దూసుకెళ్తోన్న టీఆర్‌ఎస్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్లలో రెండవ రౌండ్ లెక్కింపు జరుగుతోంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహహూబ్‌నగర్ స్థానంలో మొదటి రౌండ్ తర్వాత TRSకు 1054 ఓట్ల ఆధిక్యం ఉంది. వాణిదేవికి 17 వేల 439 ఓట్లు పోలైతే, BJP అభ్యర్థి- సిట్టింగ్ MLC రామచందర్‌రావుకు 16 వేల 385 ఓట్లు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ 8 వేల 357 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి..5 వేల 82 ఓట్లు పోలయ్యాయి. మొదట్నుంచి TRS- BJPల మధ్యే హోరాహోరీ అన్నట్టు ఓట్లు వస్తుండడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తొలిరౌండ్‌లో 3 వేల 374 ఓట్లు చెల్లకుండా పోయాయి.
నల్గొండ-వరంగల్-ఖమ్మం MLC స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో TRS అభ్యర్థి- సిట్టింగ్ MLC పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16 వేల 130ఓట్లు వస్తే.. తీన్మార్ మల్లన్నకు 12 వేల 46 ఓట్లు వచ్చాయి. TJS అధ్యక్షుడు కోదండరామ్‌కు 9 వేల 80 ఓట్లు వచ్చాయి. BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6 వేల 615 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 4 వేల 354 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండవ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితం తేలడానికి మరో 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com