Telangana: ఫామ్‌హౌస్ డీల్ కేసులో నిందితులను కస్టడీలోకి..

Telangana: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డీల్ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో ఈ ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న మొయినాబాద్ పోలీసులు.. నిందితులు నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజి స్వామీజీలను తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. ఈ సందర్భంగా నకిలీ ఆధార్, పాన్‌కార్డులు, వంద కోట్లపై ఆరాతీయనున్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com