TELANGANA: కొత్త ఏడాదిలో తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్

TELANGANA: కొత్త ఏడాదిలో తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్
X
తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త... మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మందడుగు... తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్... జనవరిలో ఎయిర్‌పోర్ట్‌కు భూమి పూజ

తె­లం­గాణ వి­మా­న­యాన రం­గం­లో మరో కీలక అధ్యా­యం ప్రా­రం­భం కా­నుం­ది. ఇప్ప­టి­కే అం­త­ర్జా­తీయ స్థా­యి­లో గు­ర్తిం­పు పొం­దిన శం­షా­బా­ద్ ఎయి­ర్‌­పో­ర్ట్‌­తో పాటు, పరి­మిత సే­వ­ల­తో కొ­న­సా­గు­తు­న్న బే­గం­పేట ఎయి­ర్‌­పో­ర్ట్‌­లు రా­ష్ట్రా­ని­కి వి­మాన రవా­ణా అవ­స­రా­ల­ను తీ­ర్చు­తు­న్నా­యి. అయి­తే ఉత్తర తె­లం­గాణ ప్ర­జల దీ­ర్ఘ­కా­లిక కల త్వ­ర­లో సా­కా­రం కా­నుం­ది. రా­ష్ట్రం­లో మూడవ ఎయి­ర్‌­పో­ర్ట్‌­గా అభి­వృ­ద్ధి కా­ను­న్న వరం­గ­ల్ వి­మా­నా­శ్ర­యం ని­ర్మా­ణా­ని­కి త్వ­ర­లో శ్రీ­కా­రం చు­ట్ట­ను­న్నా­రు. వచ్చే జన­వ­రి­లో ఈ కీలక ప్రా­జె­క్టు­కు భూమి పూజ ని­ర్వ­హిం­చేం­దు­కు ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ, తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి హా­జ­రు­కా­ను­న్నా­ర­ని సమా­చా­రం. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మందడుగు పడనుంది. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తవ్వగా.. రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించింది. దీంతో న్యాయపరమైన ఇబ్బందులు కూడా పూర్తయ్యాయి.

త్వరలోనే భూమి పూజ

త్వ­ర­లో భూ­మి­పూ­జ­కు రంగం సి­ద్ద­మైం­ది. జన­వ­రి­లో ఈ ఎయి­ర్‌­పో­ర్ట్ ని­ర్మా­ణా­ని­కి ప్ర­ధా­ని మోదీ, తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి భూమి పూజ చే­య­ను­న్నా­ర­ని సమా­చా­రం. 2027 చి­వ­రి నా­టి­కి ఎయి­ర్‌­పో­ర్ట్ ని­ర్మా­ణం పూ­ర్తి చేసి అం­దు­బా­టు­లో­కి తీ­సు­కు­రా­వా­ల­నే లక్ష్యం­తో తె­లం­గాణ ప్ర­భు­త్వం ముం­దు­కె­ళ్తుం­ది. అత్యా­ధు­నిక హం­గు­ల­తో వరం­గ­ల్ మా­ము­నూ­రు ఎయి­ర్‌­పో­ర్ట్‌­ను ని­ర్మిం­చా­ల­ని అను­కుం­టోం­ది. రా­ష్ట్రం­లో­ని ద్వి­తీయ శ్రే­ణి నగ­రా­ల్లో కూడా ఎయి­ర్‌­పో­ర్ట్ ని­ర్మిం­చా­ల­నే ఉద్దే­శం­తో ఇక్కడ ని­ర్మి­స్తోం­ది. వరం­గ­ల్ మా­మూ­నూ­రు ఎయి­ర్‌­పో­ర్ట్ ని­ర్మా­ణం కోసం ఇప్ప­ప­టి­కే భూ­సే­క­రణ ప్ర­క్రియ పూ­ర్త­యిం­ది. గతం­లో 696.14 ఎక­రా­ల­ను సే­క­రిం­చ­గా.. ఇటీ­వల 253 ఎక­రా­ల­ను సే­క­రిం­చా­రు. మొ­త్తం 950 ఎక­రా­ల­ను ఎయి­ర్‌­పో­ర్ట్ అథా­రి­టీ­కి ప్ర­భు­త్వం అప్ప­గిం­చిం­ది. రై­తు­ల­కు ఎక­రా­ని­కి రూ.1.20 కో­ట్ల చొ­ప్పు­ను పరి­హా­రం అం­దిం­చిం­ది. ఎటు­వం­టి న్యా­య­ప­ర­మైన చి­క్కు­లు లే­కుం­డా భూ­ము­ల­ను ఎయి­ర్‌­పో­ర్ట్ కోసం ప్ర­భు­త్వం సే­క­రిం­చిం­ది. శని­వా­రం భారత వి­మా­న­యాన సం­స్థ హై­ద­రా­బా­ద్ మే­నే­జ­ర్ బి.వి రావు ఎయి­ర్‌­పో­ర్ట్ ప్రాం­తా­న్ని పరి­శీ­లిం­చా­రు. వరం­గ­ల్‌­లో ఐటీ పా­ర్క్, కా­క­తీయ టె­క్స్‌­టై­ల్ పా­ర్క్ లాం­టి పె­ద్ద సం­స్థ­లు ఉం­టా­యి. ఎయి­ర్‌­పో­ర్ట్ రా­క­తో ఉత్తర తె­లం­గాణ మరిం­త­గా అభి­వృ­ద్ది చెం­ద­నుం­ది. దీని వల్ల పె­ట్టు­బ­డు­లు మరిం­త­గా పె­రి­గి వరం­గ­ల్ జి­ల్లా­లు మరిం­త­గా అభి­వృ­ద్ది చెం­దే అవ­కా­శ­ముం­ది.

కీలక అడుగు

హై­ద­రా­బా­ద్ కేం­ద్రం­గా శం­షా­బా­ద్‌­లో ఉన్న రా­జీ­వ్ గాం­ధీ అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం దే­శం­లో­నే అగ్ర­శ్రే­ణి వి­మా­నా­శ్ర­యా­ల్లో ఒక­టి­గా ని­లి­చిం­ది. అం­త­ర్జా­తీయ, దే­శీయ వి­మా­నా­ల­తో పాటు కా­ర్గో రవా­ణా­లో­నూ ఇది కీలక పా­త్ర పో­షి­స్తోం­ది. మరో­వై­పు బే­గం­పేట వి­మా­నా­శ్ర­యం ప్ర­స్తు­తం వీ­ఐ­పీ ప్ర­యా­ణా­లు, శి­క్షణ వి­మా­నా­లు, ప్ర­త్యేక చా­ర్ట­ర్ సే­వ­ల­కు మా­త్ర­మే పరి­మి­త­మైం­ది. ఈ నే­ప­థ్యం­లో హై­ద­రా­బా­ద్‌­కు దూ­రం­గా ఉన్న ప్రాం­తాల ప్ర­జ­ల­కు వి­మాన సౌ­క­ర్యా­లు మరింత చే­రువ చే­యా­ల­నే లక్ష్యం­తో రా­ష్ట్ర ప్ర­భు­త్వం కొ­త్త ఎయి­ర్‌­పో­ర్ట్ ప్రా­జె­క్టు­ను ముం­దు­కు తీ­సు­కు­వ­చ్చిం­ది. చా­రి­త్రక నగరం వరం­గ­ల్కు వి­మా­నా­శ్ర­యం రా­వా­ల­న్న డి­మాం­డ్ దశా­బ్దా­లు­గా ఉంది. ఒక­ప్పు­డు మా­ము­నూ­ర్‌­లో ఉన్న పాత ఎయి­ర్‌­స్ట్రి­ప్‌­ను ఆధు­నిక వి­మా­నా­శ్ర­యం­గా అభి­వృ­ద్ధి చే­యా­ల­ని కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు తా­జా­గా ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­యి. ఈ మే­ర­కు అవ­స­ర­మైన భూ­సే­క­రణ ప్ర­క్రియ దా­దా­పు­గా పూ­ర్త­య్యిం­ద­ని అధి­కార వర్గా­లు వె­ల్ల­డి­స్తు­న్నా­యి. సు­మా­రు వె­య్యి ఎక­రాల వి­స్తీ­ర్ణం­లో ఈ ఎయి­ర్‌­పో­ర్ట్‌­ను ని­ర్మిం­చ­ను­న్నా­రు. వరంగల్‌లో అనేక చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. రామప్ప దేవాలయం ఇప్పటికే యునెక్కో గుర్తింపు సంపాదించింది. ఇక వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ రాకతో పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఈ ప్రదేశాలకు మరింత గుర్తింపు దక్కనుంది. ఇక స్థానికంగా హోటల్ రంగం, రవాణా రంగం మరింత పుంజుకునే అవకాశలు ఉంటాయి. దీని వల్ల వేలమందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంటుంది.

ప్రపంచ వారసత్వ కట్టడాలు, కాకతీయుల చరిత్రతో వరంగల్ ఇప్పటికే పర్యాటకంగా గుర్తింపు పొందింది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో హోటళ్లు, రవాణా, స్థానిక ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఉత్తర తెలంగాణ ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో పలుమార్లు ప్రకటించినా కార్యరూపం దాల్చని ఈ విమానాశ్రయం ఇప్పుడు వాస్తవంగా మారుతుందన్న వార్తలతో ఉత్సాహం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తే, తెలంగాణ విమానయాన పటంలో మరో కీలక కేంద్రంగా వరంగల్ నిలవనుంది. వరంగల్ గుళ్లకు ప్రపంచ గుర్తింపు రానుంది.

Tags

Next Story