Telangana New Secretariat : కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది 11 ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. వుడ్‌వర్క్ జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్‌కు ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. ఈనెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టారు.
కొత్తగా కడుతున్న తెలంగాణ సెక్రటేరియట్ భవనం ఎత్తు 265 అడుగులు. భవనంపై ఎత్తైన జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 6అంతస్థులతో ఏర్పాటవుతున్న ఈ భవనానికి రెండు ప్రధాన గమ్మాలు, 34 చిన్న గుమ్మాలు ఉండనున్నాయి. ఈ భవనానికి డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్ పేరు పెట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com