Telangana: దేశంలోనే ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇచ్చేది తెలంగాణలోనే: సీఎం కేసీఆర్

Telangana: దేశంలోనే ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇచ్చేది తెలంగాణలోనే: సీఎం కేసీఆర్
X
Telangana: దేశంలోనే ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇచ్చేది తెలంగాణలోనే అన్నారు సీఎం కేసీఆర్. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు.

Telangana: దేశంలోనే ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇచ్చేది తెలంగాణలోనే అన్నారు సీఎం కేసీఆర్. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛాంబర్‌లోని సీట్‌లో కలెక్టర్‌ రవిని కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.



అటు.. కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగుర వేశారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యాలయంలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును సీట్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వైద్య కళాశాల భవన నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.


మనది ధనిక రాష్ట్రం అవుతుందని తెలంగాణ ఏర్పడ్డప్పుడే తాను చెప్పానన్నారు సీఎం కేసీఆర్‌. ఉద్యోగులు కూడా తెలంగాణ కోసం పెన్‌డౌన్ చేశారని గుర్తు చేశారు. అనేక రంగాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని చెప్పారు.



అనతి కాలంలోనే తెలంగాణ ఉన్నత స్థాయికి చేరుకుందని చెప్పారు. భయంకరమైన కారు చీకట్లను చీల్చుకుంటూ ముందుకెళ్లామని.. కేంద్రం సహకరించకున్నా జిల్లాకో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.


రైతుబంధులో కూడా లిమిట్‌ పెట్టొచ్చు కదా అంటున్నారని కేసీఆర్‌ ప్రస్తావించారు. 25 ఎకరాలకు పైగా ఉన్నవారు ఒక్క శాతమే ఉన్నారని.. 25 ఎకరాలకు పైగా ఉన్నవారు 0.28 పర్సెంట్‌ మాత్రమేనన్నారు. నాడు కరువులు.. నేడు సమిష్టి కృషితోనే రాష్ట్రం ఉన్నత స్థాయికి చేరిందని చెప్పారు. 93 శాతం రైతులకు ఒక ఏకరా మాత్రమే ఉందని అన్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేసీఆర్‌.

Tags

Next Story