TPCC : తెలంగాణ పీసీసీ ఎంపిక దాదాపు పూర్తి..!

TPCC : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది . ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికకు సంబంధించిన జాబితా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతికి వెళ్లిందని.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని సమాచారం. టీపీసీసీ ప్రెసిండెట్తో పాటు, వర్కింగ్ ప్రెసిండెట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సహా ఇతర కమిటీలను సైతం సోనియా ప్రకటించనున్నారని తెలిసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాతే పీసీసీ ప్రెసిండెట్‌ను ఎంపిక జరిగినట్లు.. ఏ క్షణమైనా అధికారిక ఉత్తర్వులు రావొచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
టీపీసీసీ అధ్యక్ష పదవికోసం పలువురు సీనియర్ నేతలు పోటిపడినా.. తుదకు ఎంపీలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లనే అధిష్టానం పరిగణలోకి తీసుకుంది. ఇద్దరిలో ఎవరో ఒకరూ అధ్యక్షుడు ఖాయమని తెలిస్తోంది. అధ్యక్షుడితో పాటు ఆరు వర్కింగ్ ప్రెసిండెట్ పేర్లను కూడా అధిష్టానం ప్రకటించనుంది. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా వర్కింగ్ ప్రెసిండెట్ల ఎంపిక జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com