TSLPRB : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

TSLPRB : తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ వాయిదాపడింది. ఈ నెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 28న నిర్వహించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. సాంకేతిక కారణాల రీత్యా తేదీని మార్చినట్టు వెల్లడించింది. తెలంగాణలో ఆగస్టు 7న ఎస్సై రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైంది. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ జారీ అయింది. కానిస్టేబుల్ పోస్టులకు 9.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నియామక బోర్డు అధికారులు గతంలోనే తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com