సరిహద్దు వద్ద ఏపీ కొవిడ్‌ అంబులెన్స్‌లు అడ్డగింత..!

సరిహద్దు వద్ద ఏపీ కొవిడ్‌ అంబులెన్స్‌లు అడ్డగింత..!
ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు పెట్టారు. ఏపీ నుంచి వచ్చే కరోనా బాధితులను అనుమతించట్లేదు.

ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు పెట్టారు. ఏపీ నుంచి వచ్చే కరోనా బాధితులను అనుమతించట్లేదు. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ.. అంబులెన్లను వెనక్కి పంపుతున్నారు. ఆస్పత్రిలో బెడ్ ఖాళీగా ఉందని అనుమతి పత్రం ఉంటేనే పర్మిషన్ ఇస్తున్నారు. హైదరాబాద్ వచ్చి బెడ్ దొరక్క ఆస్పత్రుల చుట్టూ తిరగడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story