KCR : కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం..

KCR : కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం..
KCR : తెలంగాణ సెక్రటేరియట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టడంపై తెలంగాణ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

KCR : తెలంగాణ సెక్రటేరియట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టడంపై తెలంగాణ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు. సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అన్న పేరును సార్ధకం చేసుకున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.

భారత నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేసిన తొలి అసెంబ్లీగా తెలంగాణ అసెంబ్లీ నిలుస్తుందని అరూరి రమేష్ అన్నారు. తెలంగాణ సెక్రటేరియట్‌గా అంబేద్కర్ పెట్టిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి అరూరి రమేష్ పాలాభిషేకంచేశారు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహంతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై మంత్రి జగదీష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్‌ వద్ద పాలాభిషేకం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు కిషోర్, సైదిరెడ్డి, జెడ్పీ చైర్మన్ దీపిక కలిసి క్షీరాభిషేకం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story