Munugode: మునుగోడు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు.. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు..

Munugode: మునుగోడు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు.. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు..
Munugode: తెలంగాణ రాజకీయాలన్ని ఇప్పుడు మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. అభ్యర్థులు ఖరారు కావడంతో...గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి.

Munugode: తెలంగాణ రాజకీయాలన్ని ఇప్పుడు మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. అభ్యర్థులు ఖరారు కావడంతో...గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. హుజురాబాద్‌ గెలుపు అనుభవంతో బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించగా.. అక్కడి ఓటమే గుణపాఠంగా అందివచ్చిన అన్ని అవకాశాలను టీఆర్ఎస్‌ వినియోగించుకుంటోంది.

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ టీఆర్ఎస్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ప్రచారం ప్రణాళికబద్ధంగా సాగాలని ప్రచార ఇన్‌ఛార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు.

ఫ్లోరైడ్‌ విముక్తికి టీఆర్ఎస్‌ సర్కార్ చేసిన కృషిని వివరించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలను గడపగడపకూ తీసుకెళ్లాలన్నారు. రాజగోపాల్‌ రెడ్డి తీరు, బీజేపీ వల్ల దేశం, రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు.

ఇక ఇవాళ మునుగోడు మండలం కొరటికల్‌ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి. ప్రచారంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి పాల్గొననున్నారు. కొరటికల్‌, గూడపూర్‌, కలువలపల్లి, బీరెల్లిగూడెం, పులిపలుపుల, జమిస్తాన్ పల్లి, గుండ్లోరిగూడ గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రచారం సాగనుంది.

ఇక ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల దృష్ట్యా సాదాసీదాగానే నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. సీపీఎం, సీపీఐ ముఖ్యనాయకులతో కలిసి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ల చివరి రోజైన ఈ నెల 14న మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి సైతం ఇవాళే నామినేషన్‌ వేయనున్నారు. మునుగోడులోని తన క్యాంపు కార్యాలయం నుంచి 50 వేల మందితో చండూరుకు చేరుకుని అక్కడ 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

నామినేషన్ దాఖలు కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌..రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జులు తరుణ్‌ చుగ్‌, పవన్ బన్సల్, ఎంపీ లక్ష్మణ్‌, బై పోల్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి సహా పలువురు నేతలు పాల్గొననున్నారు.

మరోవైపు రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జులు తరుణ్‌ చుగ్‌, సహా ఇంఛార్జ్ అరవింద్ మీనన్‌...బైపోల్ స్టీరింగ్‌ కమిటీతో సమావేశమై ప్రచార సరళిపై చర్చించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లలాని నేతలకు సూచించారు. మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్‌ సైతం ఆదివారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 14 వరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఎవరైనా పార్టీ మారాలని బెదిరిస్తే..వాళ్లు ఎంతటి వాళ్లైనా వీపు విమానం మోత మోగుతుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కొందరు పశువుల్లా అమ్ముడు పోయారని రేవంత్ ఆరోపించారు.

అమ్ముడుపోయిన నేతలను ఆదరించొద్దని ప్రజలను కోరారు. ఆరుగురు ఎమ్మెల్యేలున్న పార్టీ నుంచి..రాజగోపాల్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీకి మారారని ఎద్దెవా చేశారు. అభివృద్ధి ఎట్లా జరుగుతుందో చెప్పాలన్నారు. నాలుగు ఉపఎన్నికల్లో బీజేపీని రెండు, టీఆర్ఎస్‌ను రెండు స్థానాల్లో గెలిపిస్తే ఒరిగిందేం లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story