TS ELECTONS: అలా కోడ్‌ కూసింది.. ఇలా డబ్బు దొరికింది

TS ELECTONS: అలా కోడ్‌ కూసింది.. ఇలా డబ్బు దొరికింది
తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్‌... మొదటిరోజే భారీగ నగదు స్వాధీనం

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ మూడు కమిషనరేట్ల పరిధితోపాటు జిల్లాల్లోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ అనుమానం ఉన్న వాహనాలను ఆపి.. పరిశీలిస్తున్నారు. పోలీసులు చేస్తున్న ప్రత్యేక తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పట్టుడుతోంది. మొదటి రోజే కోట్ల రూపాలయల నగదు, బంగారం పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న సొత్తుకు సరైన పత్రాలు చూపకపోతే ఐటీ శాఖకు అందజేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అబిడ్స్‌లో కారులో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న పది కోట్ల విలువైన7 కిలోల బంగారం, 295 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. షేక్ పేట్ వద్ద కారులో తరలిస్తున్న 30 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.


హైదరాబాద్‌ ఫిలింనగర్ నారాయణమ్మ కళాశాల వద్ద కారును పరిశీలించగా 30లక్షలు నగదు పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఛాదర్‌ఘాట్ క్రాస్‌రోడ్‌లో 9లక్షలు తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పురానాపూల్ గాంధీ విగ్రహం సమీపంలో యాక్టీవాలో తరలిస్తున్న 15లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ ఠాణా పరిధిలో ఐదున్నర కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులుc రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

నిజాం కళాశాల వద్ద కారులో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న ఏడున్నర కోట్ల విలువైన 7కిలోల బంగారం, 295 కిలోల వెండి పట్టుబడింది. కారులోని ముగ్గురు వ్యక్తులను విచారిస్తున్నారు. సికింద్రాబాద్‌కి చెందిన క్యాప్స్ గోల్డ్ సంస్థ ఇతర బ్రాంచీలకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం ఐటీ అధికారులకు సమాచారం అందించారు. సరైన పత్రాలు చూపితే తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారుల విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. వనస్థలిపురం పరిధి ఆటోనగర్ వద్ద తనిఖీల్లో కారులో తరలిస్తున్న 5లక్షలను పోలీసులు స్వాధనం చేసుకున్నారు. చైతన్యపురి ఠాణా పరిధిలో 30 లక్షలను వ్యక్తి నుంచి స్వాధీనంచేసుకుని పోలీసులకు అప్పగించారు. శేరిలింగంపల్లిలో ఓటర్లకు కుక్కర్లు పంచేందుకు ప్రయత్నించగా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. కుక్కర్లపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత రఘునాథ్‌ స్టిక్కర్‌లు ఉన్నట్లు గుర్తించారు.

Tags

Next Story