ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయసు పెంపు

X
By - prasanna |27 Jan 2021 4:51 PM IST
అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును
Telangana PRC Report: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక విడుదల అయింది. తొలి వేతన సవరణ నివేదికను పీఆర్సీ నివేదికను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీని ప్రకారం ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్‌మెంట్ పెంపును ప్రతిపాదించింది. అంతేకాకుండా కనీస వేతనం రూ.19 వేలుగా, గరిష్ట వేతనంగా రూ.162 లక్షలుగా ఉండాలని పీఆర్సీ రిపోర్ట్ పేర్కొంది.
హెచ్‌ఆర్‌ఏను కూడా 30 శాతం నుంచి 24 శాతానికి కుదించింది. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. కాగా ఈ అంశంపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. వివిధ సమస్యలపై ఇరువర్గాలు చర్చించనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com