Telangana: సిగాచి ఫార్మా కంపెనీ యూనిట్‌లో పేలిన రియాక్టర్.. 20 మందికి గాయాలు..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని పాసమైలారం ఫేజ్ 1లో ఉన్న సిగాచి ఫార్మా కంపెనీ యూనిట్‌లో రియాక్టర్ పేలుడు సంభవించింది. అత్యవసర సేవలు వేగంగా స్పందించాయి, సంఘటనను అదుపు చేయడానికి పదకొండు అగ్నిమాపక యంత్రాలను మోహరించారు.
"ఈ సంఘటన పాసమైలారం ఫేజ్ 1లోని సిగాచి ఫార్మా కంపెనీలో జరిగింది. పదకొండు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 15-20 మంది గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని తెలంగాణ అగ్నిమాపక అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
పేలుడు జరిగిన ప్రదేశంలో స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. సంగారెడ్డి పోలీసు సూపరింటెండెంట్ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాాచారం తెలిసేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
పేలుడు జరిగిన ప్రదేశం నుండి దట్టమైన పొగ ఎగసిపడుతున్నాయి. సహాయక చర్యలు ముగిసిన తర్వాత పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com