Telangana: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..

Telangana: తెలుగువారి పండగ అంటే సరదాలు, షికార్లు సినిమాలు మాత్రమే కాదు.. మద్యం, మాంసం కూడా ఉండాల్సిందే. అవి లేకపోతే పండగ పూర్తి కాదంటారు మందుబాబులు. అందుకే పండగ వచ్చిందంటే చాలు.. మద్యం అమ్మకాలు ఆకాశాన్నంటుతాయి. ఈసారి దసరాకు కూడా అదే జరిగింది. పండగ సందర్భంగా మద్యం, చికెన్, మటన్ అమ్మకాలు రికార్డు సృష్టించాయి.
అక్టోబర్ 15 ఒక్కరోజే రాష్ట్రంలో ఏకంగా రూ. 200 కోట్ల మద్యం అమ్మకం జరిగింది. ఇక అక్టోబర్ 11 నుండి 15 మధ్యలో రూ. 685 కోట్ల మద్యాన్ని తాగేశారు మందుబాబులు. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలో 7.78 లక్షల కేసుల లిక్కర్, మరో 2.36 లక్షల కేసులు బీర్లు అమ్ముడయ్యాయి
ధర కాస్త ఎక్కువగా ఉండడంతో గ్రేటర్ ప్రజలు మటన్ కంటే ఎక్కువగా చికెన్‌కు అధిక ప్రాధాన్యమిచ్చారు. చికెన్, మటన్ విషయానికొస్తే గురువారం, శుక్రవారం రెండు రోజులు కలిపి 50 లక్షల కేజీల చికెన్, 10 నుండి 12 లక్షల కేజీల మటన్ విక్రయించారు. .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com