రేపటి నుంచి రైతు బంధు నగదు జమ.. పోస్టాఫీసులో సొమ్ము ఇచ్చేలా ఏర్పాట్లు

రేపటి నుంచి రైతు బంధు నగదు జమ.. పోస్టాఫీసులో సొమ్ము ఇచ్చేలా ఏర్పాట్లు
ఆధార్‌, బ్యాంక్‌ పాసు పుస్తకం తీసుకొని సమీపంలోని పోస్టాఫీసుకు వెళితే రైతు సొమ్ము ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో రైతు బంధు నగదు జమ చేయడానికి వ్యవసాయ, ఆర్థిక శాఖలు కసరత్తు చేస్తున్నాయి. రేపటి నుంచి రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో.. ఆ తర్వాత 2, 3, 4 ఎకరాల్లోపు వారికి సొమ్ము జమ చేస్తారు. ఎకరానికి 5వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నారు. మొత్తం 59.32 లక్షల మంది రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. గత జులై 1 నుంచి ఈ నెల 10 వరకు భూములు కొన్న, కుటుంబాల్లో భూ పంపకాల వల్ల కొత్తగా పేర్లు నమోదైన 1.75 లక్షల మంది పేర్లను వ్యవసాయ అధికారులు గుర్తించారు. రైతు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కాగానే అతని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. వెంటనే ఆధార్‌, బ్యాంక్‌ పాసు పుస్తకం తీసుకొని సమీపంలోని పోస్టాఫీసుకు వెళితే రైతు సొమ్ము ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.


Tags

Next Story