REVANTH: ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ: సీఎం

REVANTH: ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ: సీఎం
X
క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ సమీక్ష.. స్పోర్ట్స్‌ వర్సిటీ డిజైన్లు పరిశీలన.. అధికారులకు సీఎం కీలక సూచనలు

తె­లం­గా­ణ­లో క్రీ­డల అభి­వృ­ద్ధి­కి మరింత ప్రా­ధా­న్యం ఇవ్వా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. భవి­ష్య­త్తు­లో ఒలిం­పి­క్స్‌ వంటి అం­త­ర్జా­తీయ క్రీ­డ­ల్లో తె­లం­గాణ క్రీ­డా­కా­రు­లు మె­రు­గైన ప్ర­తిభ కన­బ­ర్చే­లా ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­ల­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి సూ­చిం­చా­రు. క్రీ­డా­కా­రు­ల­కు అవ­స­ర­మైన అత్యా­ధు­నిక సదు­పా­యా­లు కల్పిం­చ­డం­తో పాటు అం­త­ర్జా­తీయ ప్ర­మా­ణా­ల­తో క్రీ­డా మౌ­లిక వస­తు­ల­ను అభి­వృ­ద్ధి చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు ఆదే­శిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో సో­మ­వా­రం క్రీ­డా­శాఖ పని­తీ­రు­పై ము­ఖ్య­మం­త్రి సమీ­క్ష ని­ర్వ­హిం­చి పలు కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు.

సమావేశంలో ముఖ్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అభివృద్ధి అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల క్రీడలకు అవసరమైన మైదానాలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతమైన క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందేలా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. యూ­ని­వ­ర్సి­టీ ని­ర్మా­ణా­ల­కు సం­బం­ధిం­చి రూ­పొం­దిం­చిన పలు డి­జై­న్ల­ను ము­ఖ్య­మం­త్రి పరి­శీ­లిం­చా­రు. మౌ­లిక సదు­పా­యా­లు, క్రీ­డా మై­దా­నా­లు, శి­క్షణ కేం­ద్రా­లు వంటి అం­శా­ల­పై అధి­కా­రు­ల­తో చర్చిం­చి కొ­న్ని మా­ర్పు­లు, సూ­చ­న­లు చే­శా­రు. క్రీ­డా­కా­రు­ల­కు అవ­స­ర­మైన వస­తు­లు ఒకే ప్రాం­గ­ణం­లో లభిం­చే­లా ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­ల­ని చె­ప్పా­రు.

అదే­వి­ధం­గా గచ్చి­బౌ­లి ఔట్‌­డో­ర్ స్టే­డి­యా­న్ని పు­న­రు­ద్ధ­రిం­చే అం­శం­పై­నా సమా­వే­శం­లో చర్చ జరి­గిం­ది. స్టే­డి­యా­న్ని ఆధు­నిక సదు­పా­యా­ల­తో తి­రి­గి అభి­వృ­ద్ధి చే­య­డం­తో పాటు అక్కడ ఇం­డో­ర్ స్టే­డి­యం, యూ­ని­వ­ర్సి­టీ కాం­ప్లె­క్స్, హా­స్ట­ల్ భవ­నా­లు ని­ర్మిం­చా­ల­ని సీఎం సూ­చిం­చా­రు. క్రీ­డా­కా­రు­లు సౌ­క­ర్య­వం­తం­గా శి­క్షణ పొం­దేం­దు­కు అవ­స­ర­మైన అన్ని మౌ­లిక వస­తు­లు ఉం­డే­లా చర్య­లు తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. అలా­గే వి­విధ క్రీ­డ­ల­కు అను­గు­ణం­గా ప్ర­త్యేక మై­దా­నా­లు ఏర్పా­టు చే­యా­ల­ని చె­ప్పా­రు. తె­లం­గాణ భవి­ష్య­త్తు­లో ఒలిం­పి­క్స్‌, కా­మ­న్‌­వె­ల్త్‌ క్రీ­డ­ల­కు ఆతి­థ్యం ఇవ్వ­గల స్థా­యి­కి ఎద­గా­ల­ని ము­ఖ్య­మం­త్రి అభి­ప్రా­య­ప­డ్డా­రు. అం­త­ర్జా­తీయ స్థా­యి క్రీ­డా వే­ది­క­గా తె­లం­గా­ణ­ను ని­ల­బె­ట్టా­లం­టే ఇప్ప­టి నుం­చే సమ­గ్ర ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం చే­యా­ల­ని సూ­చిం­చా­రు.

Tags

Next Story