SLBC: టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ(SLBC) టన్నెల్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాలు గుర్తించాయి. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద జరిగిన SLBC సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అధునాతన పరికరాలు, రాడార్‌లను ఉపయోగించి మూడు మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది. వీరిలో ఆరుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు తెలుస్తోంది. టన్నెల్‌లో చిక్కుకుని మొత్తం 8 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. వీరిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీయగా.. మిగిలిన రెండు డెడ్ బాడీలను బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది.
ఏడు రోజుల తర్వాత
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ(SLBC) టన్నెల్లో ప్రమాదం జరిగిన ఏడు రోజుల తర్వాత కార్మికుల మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా మట్టి లో కూరుకుపోయిన 5 మృతదేహాలు గుర్తించారు. ఈ 5 మృతదేహాలను వెలికి తీయడానికి మరింత సమయం పడుతుందని, కొన్ని మీటర్ల లోతు మట్టి లో మృతదేహాలు కూరుకు పోయినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురి మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలిస్తున్నారు.
అధునాతన సాంకేతికతతో
ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసేందుకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రంగంలోకి దిగింది. భూమిలో కూరుకుపోయిన వారి స్థితిని తెలుసుకునేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్ టెక్నాలజీని ఉపయోగించి, భూమిలోకి తొలగిపోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందం శ్రమిస్తోంది. మిషన్ ఆధారంగా ఎన్జీఆర్‌ఐ బృందం టన్నెల్‌ను పూర్తిగా స్కాన్ చేసింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే రోజున 8మంది టన్నెల్‌లో చిక్కుకున్నారు. వారి జాడ తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక యంత్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్‌ను లోపలికి పంపింది. పైకప్పు కూలిపడిన చోట శిథిలాల కింద ఏముందని పరిశీలించారు. ఈక్రమంలోనే మూడు అడుగుల మట్టిలో 8మంది మృతదేహాలు కూరుకుపోయి ఉన్నట్లుగా పరికరం ద్వారా తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com