Telangana: తరలివస్తున్న అతిరథ మహారథులు

Telangana:  తరలివస్తున్న అతిరథ మహారథులు
X

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు తరలిరానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే మాజీ సీఎం KCR, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడునుప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబంగా, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక ముఖ్యమంత్రులకు కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానాలు పంపింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మాజీ సీఎంలను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మెయిలీ, కుంతియా వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్‌, చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ శిందే, కురియన్‌లతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు ఆహ్వానాలు పంపారు. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఉన్నతాధికారులకు, మేధావులకు కాంగ్రెస్‌ ఆహ్వానాలు పంపింది. కొత్తగా ఎన్నికైన 119మంది MLAలకు, మాజీ ప్రజా ప్రతినిధులకు, కాంగ్రెస్‌ పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో 300మందితో పాటు కోదండరాం, హరగోపాల్, కంచె ఐలయ్య సహా 250మంది ఉద్యమకారులను కాంగ్రెస్‌ నాయకత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది.

Next Story