TELANGANA SUMMIT: అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ సమ్మిట్‌

TELANGANA SUMMIT: అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ సమ్మిట్‌
X
తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌కు ఏర్పాట్లు... డిసెంబరు 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహణ.. అంతర్జాతీయ స్థాయి ఉత్సవంలా ఏర్పాట్లు

తె­లం­గాణ రై­జిం­గ్ గ్లో­బ­ల్ సమ్మి­ట్‌ ఏర్పా­ట్ల­ను ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి పరి­శీ­లిం­చా­రు. అనం­త­రం, ఈ సమ్మి­ట్‌­కు సం­బం­ధిం­చి పలు వి­ష­యా­ల­పై అధి­కా­రు­ల­కు కీలక ఆదే­శా­లు ఇచ్చా­రు. అం­త­ర్జా­తీయ స్థా­యి­లో అత్యు­న్నత ప్ర­మా­ణా­ల­తో ఈ సమ్మి­ట్‌­ను ని­ర్వ­హిం­చా­ల­ని చె­ప్పా­రు. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా వి­విధ దే­శాల ప్ర­తి­ని­ధు­లు, అం­బా­సి­డ­ర్లు ఈ సమ్మి­ట్‌­లో పా­ల్గొ­నే అవ­కా­శం ఉం­ద­న్నా­రు. సమ్మి­ట్‌­కు సం­బం­ధిం­చిన ఏర్పా­ట్ల­లో ఎలాం­టి ఇబ్బం­దు­లు కల­గ­కుం­డా జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు. సెం­బ­ర్ 8, 9 తే­దీ­ల్లో ని­ర్వ­హిం­చే తె­లం­గాణ రై­జిం­గ్ గ్లో­బ­ల్ సమ్మి­ట్ కు ఘనం­గా ఏర్పా­ట్లు చే­యా­ల­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ఫ్యూ­చ­ర్ సిటీ ఏరి­యా­లో ని­ర్వ­హిం­చే రెం­డు రో­జుల వే­డు­క­ల­ను రెం­డేం­డ్ల వి­జ­యో­త్స­వా­లు­గా జర­పా­ల­ని సూ­చిం­చా­రు. గ్లో­బ­ల్ సమ్మి­ట్ ఏర్పా­ట్ల­పై శని­వా­రం మధ్యా­హ్నం సీ­ఎం­వో అధి­కా­రు­ల­తో ఆయన ప్ర­త్యే­కం­గా సమా­వే­శ­మ­య్యా­రు. 9వ తే­దీన రెం­డో రో­జున తె­లం­గాణ భవి­ష్య­త్తు దా­ర్శ­ని­క­త­ను, భవి­ష్య­త్తు ప్ర­ణా­ళి­క­ల­ను పొం­దు­ప­రి­చిన తె­లం­గాణ రై­జిం­గ్ 2047 డా­క్యు­మెం­ట్ను ఆవి­ష్క­రిం­చే కా­ర్య­క్ర­మా­లు చే­ప­ట్టా­ల­న్నా­రు. ఇదే ప్రాం­గ­ణం­లో తె­లం­గా­ణ­లో పా­రి­శ్రా­మిక వి­ధా­నా­న్ని, పె­ట్టు­బ­డు­ల­కు ఇస్తు­న్న ప్రా­ధా­న్య­త­ను ప్ర­పం­చా­ని­కి చా­టి­చె­ప్పే­లా రౌం­డ్ టే­బు­ల్ మీ­టిం­గ్స్ ఏర్పా­టు చే­యా­ల­న్నా­రు. అన్ని వి­భా­గా­లు తమ భవి­ష్య­త్తు లక్ష్యా­ల­న్ని కళ్ల­కు కట్టిం­చే ఆడి­యో వీ­డి­యో ప్ర­ద­ర్శ­న­లు, ప్ర­జం­టే­ష­న్లు తయా­రు చే­సు­కో­వా­ల­ని సీఎం సూ­చిం­చా­రు.

శాఖల వారీగా ఎంట్రీ

ఈ సమ్మట్ కు పాస్‍లు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదని, సమ్మిట్‍కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదని సీఎం ఆదేశించారు. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని ఏర్పాట్లను తాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పారు. పోలీస్‍లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పార్కింగ్‍కు ఇబ్బంది రావొద్దన్నారు. బందో‍బస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, సమ్మిట్‍కు హాజరయ్యే మీడియా‍కు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సమ్మిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, స్కీమ్‍ల వివరాలను ప్రదర్శించనున్నరాు. రెండో రోజు తెంలగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది.

Tags

Next Story