Telangana TDP : కరీంనగర్ లో టీడీపీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి

Telangana TDP : కరీంనగర్ లో టీడీపీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
X

తెలంగాణలో మళ్లీ బలోపేతం అయ్యేందుకు టీడీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇటీవల ఖమ్మం సభ సక్సెస్ కావడంతో... ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం వచ్చింది. అదే ఉత్సాహంతో.. ఇవాళ కరీంనగర్‌లోను బహిరంగ సభ నిర్వహించనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో పలు పార్టీలకు చెందిన నేతలు.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఇంటింటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లామని, త్వరలోనే తెలంగాణ లో బస్సు యాత్ర చేస్తామంటున్నారు కాసాని జ్ఞానేశ్వర్‌. పాత కొత్త క్యాడర్ అందరిని కలుపుకుని.. ముందుకు వెళ్తామన్నారాయన. అన్ని జిల్లాల్లో సమావేశాలు అయ్యాక.. పరేడ్ గ్రౌండ్లో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Next Story