TELANGANA: సైబరాసురులకు చెక్ పెడుతున్న తెలంగాణ పోలీస్

TELANGANA: సైబరాసురులకు చెక్ పెడుతున్న తెలంగాణ పోలీస్
X
100 మందికి పైగా సైబర్ కేటుగాళ్లు అరెస్ట్

సై­బ­ర్ నే­రా­ల­కు అడ్డు­క­ట్ట వే­సేం­దు­కు తె­లం­గాణ సై­బ­ర్ క్రై­మ్ పో­లీ­సు­లు చే­ప­ట్టిన వి­స్తృత ఆప­రే­ష­న్ దే­శ­వ్యా­ప్తం­గా సం­చ­ల­నం­గా మా­రిం­ది. "ఆప­రే­ష­న్ ఆక్టో­ప­స్" పే­రు­తో ని­ర్వ­హిం­చిన ఈ సమ­న్వయ దా­డు­ల్లో ఏక­కా­లం­లో 16 రా­ష్ట్రా­ల్లో సో­దా­లు జరి­పి అతి­పె­ద్ద సై­బ­ర్ నేర ము­ఠా­ను పో­లీ­సు­లు ఛే­దిం­చా­రు. వంద మం­ది­కి పైగా నిం­ది­తు­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కో­వ­డం­తో పాటు భారీ ఎత్తున నగదు, బ్యాం­కు పత్రా­లు, ఎల­క్ట్రా­ని­క్ పరి­క­రా­లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. ఇటీ­వ­లి కా­లం­లో "డి­జి­ట­ల్ అరె­స్ట్" పే­రు­తో ప్ర­జ­ల­ను బె­ది­రి­స్తూ డబ్బు­లు దో­చు­కు­నే మో­సా­లు పె­రి­గా­యి. అలా­గే ప్ర­ము­ఖుల, సె­ల­బ్రి­టీల ఫో­టో­లు, వీ­డి­యో­ల­ను దు­ర్వి­ని­యో­గం చే­స్తూ మో­సా­ల­కు పా­ల్ప­డు­తు­న్న ఘట­న­లు అధి­క­మ­య్యా­యి. కేం­ద్ర­మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్ ఫో­టో­లు, వీ­డి­యో­ల­ను ఉప­యో­గిం­చి నకి­లీ ప్ర­క­ట­న­లు, మో­స­పూ­రిత పథ­కాల పే­రు­తో ప్ర­జ­ల­ను మభ్య­పె­డు­తు­న్న ము­ఠా­ల­పై ఫి­ర్యా­దు­లు వె­ల్లు­వె­త్తా­యి. దీంతో పో­లీ­సు­లు దర్యా­ప్తు వే­గ­వం­తం చే­శా­రు. ఈ నేర గుంపులు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సమన్వయంతో నెట్‌వర్క్‌లను నడుపుతున్నట్లు తేలింది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యాణా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్‌లు క్రియాశీలంగా ఉన్నట్లు గుర్తించారు.

మొ­త్తం 16 రా­ష్ట్రా­ల్లో 32 ప్ర­త్యేక బృం­దా­ల­ను ఏర్పా­టు చేసి సమ­న్వ­యం­గా దా­డు­లు ని­ర్వ­హిం­చా­రు. ఈ ఆప­రే­ష­న్‌­లో 104 మంది సై­బ­ర్ నే­ర­గా­ళ్ల­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. వీ­రి­లో మ్యూ­ల్ అకౌం­ట్ హో­ల్డ­ర్లు, బ్యాం­కు ఖా­తా­ల­ను సర­ఫ­రా చేసే మధ్య­వ­ర్తు­లు, అకౌం­ట్ సప్ల­య­ర్లు, సై­బ­ర్ మో­స­గా­ళ్లు మా­త్ర­మే కా­కుం­డా కొం­త­మం­ది బ్యాం­కు అధి­కా­రు­లు కూడా ఉన్న­ట్లు పో­లీ­సు­లు వె­ల్ల­డిం­చా­రు. సై­బ­ర్ నే­రా­ల­కు బ్యాం­కు స్థా­యి­లో సహ­కా­రం అం­దిం­చిన వా­రి­ని కూడా వి­చా­ర­ణ­లో భా­గం­గా అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. ఇప్ప­టి­వ­ర­కు ఈ ము­ఠా­లు 1055 సై­బ­ర్ నే­రా­ల­కు పా­ల్ప­డి­న­ట్లు పో­లీ­సు­లు ఆధా­రా­లు సే­క­రిం­చా­రు. బా­ధి­తుల నుం­చి కో­ట్ల రూ­పా­యల వరకు మో­స­పూ­రి­తం­గా వసూ­లు చే­సి­న­ట్లు అను­మా­ని­స్తు­న్నా­రు. దా­డుల సం­ద­ర్భం­గా 204 మొ­బై­ల్ ఫో­న్లు, 141 సిమ్ కా­ర్డు­లు, 152 బ్యాం­క్ పా­స్‌­బు­క్స్, 234 క్రె­డి­ట్ మరి­యు డె­బి­ట్ కా­ర్డు­లు, 26 ల్యా­ప్‌­టా­ప్‌­లు, 56 కా­ర్పొ­రే­ట్ స్టాం­పు­లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. అద­నం­గా రూ.36 లక్షల నగ­దు­ను సీజ్ చే­శా­రు. "డి­జి­ట­ల్ అరె­స్ట్" పే­రిట ఫోన్ కా­ల్స్ చేసి తాము కేం­ద్ర దర్యా­ప్తు సం­స్థల అధి­కా­రు­ల­మ­ని చె­ప్పి భయ­పె­ట్టి డబ్బు­లు వసూ­లు చేసే మో­సా­లు ఈ ము­ఠా­లు ని­ర్వ­హి­స్తు­న్న­ట్లు పో­లీ­సు­లు తె­లి­పా­రు. అలా­గే ప్ర­ము­ఖుల వీ­డి­యో­ల­ను మో­ర్ఫిం­గ్ చేసి పె­ట్టు­బ­డుల పే­రు­తో మో­సా­లు చే­సి­న­ట్లు గు­ర్తిం­చా­రు.

Tags

Next Story