TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, 4న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకూ నిర్వహించనున్నారు.
పూర్తి షెడ్యూల్ ఇదే..
మార్చి 21న (శుక్రవారం) - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22న (శనివారం) - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24న (సోమవారం) - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 26న (బుధవారం) - గణితం
మార్చి 28న (శుక్రవారం) - సైన్స్ (ఫిజికల్ సైన్స్)
మార్చి 29న (శనివారం) - సైన్స్ (బయాలజీ)
ఏప్రిల్ 2న (బుధవారం) - సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3న (గురువారం) - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - 1
ఏప్రిల్ 4న (శుక్రవారం) - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - 2
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com