TG:తల'సిరి'లో తెలంగాణ టాప్

పెద్ద రాష్ట్రాల తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలిచినట్లు స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్(2023-24)నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564గా ఉంది. రాష్ట్ర జనాభా 3.5 కోట్లు ఉండగా, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 1.5 కోట్ల మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఐటీ, రియల్ ఎస్టేట్, సేవారంగాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2024 సంవత్సరానికిగాను ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంగ్రహణం’ను రూపొందించాయి. ఈ అట్లాస్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,84,205గా ఉందని, దానికంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,72,359 ఎక్కువని వివరించింది. తెలంగాణ తలసరి ఆదాయం 2022-23 నుంచి 2023-24 మధ్య కాలంలో 14.1 శాతం పెరిగిందని, దక్షిణాది రాష్ట్రాలన్నిటినీ అధిగమించిందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com