Niti Ayog : ఆ విభాగంలో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్..

Niti Ayog : నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ రెండో ర్యాంకు సాధించింది. కర్ణాటక ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఏపీ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ర్యాంకుల్లో క్రితంసారి నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ...ఈ సారి రెండో స్థానానికి ఎగబాకింది. ఏపీ ఏడో స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది.
17 పెద్ద రాష్ట్రాలు, పది ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును వేర్వేరుగా మదించి నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ర్యాంకుల కోసం తీసుకున్న కొలమానాలను ఎనేబులర్స్, పెర్ఫార్మర్స్ పేరుతో రెండుగా విభజించారు.
ఎనేబులర్స్ విభాగంలో తెలంగా నాలుగో స్థానం, ఏపీ 8వ స్థానం సంపాదించాయి. పెర్ఫార్మర్స్ విభాగంలో తెలంగాణ ఫస్ట్ ప్లేసులో నిలవగా..ఏపీ 14వ స్థానంతో సరిపెట్టుకుంది. విజ్ఞానవ్యాప్తిలో మాత్రం తెలంగాణ ర్యాంకు మెరుగుపరుచుకోలేకపోయిందని నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించింది.
నీతి ఆయోగ్ విడుదల చేసిన అన్ని విభాగాల్లో తెలంగాణరెండో స్థానంలో, పెర్ఫార్మర్స్ విభాగంలో ఫస్ట్ ప్లేసు రావడంతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు లభించిన పురస్కారమని మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com