BJP: తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే

BJP: తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులు ఖరారు... ముగ్గురు సిట్టింగులకు చోటు.. మల్కాజిగిరి నుంచి ఈటల

లోక్‌సభ ఎన్నికల తొలి జాబితాలో తెలంగాణలోని 9స్థానాలకు బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రస్తుత సిట్టింగ్‌ స్థానాల్లో సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీలనే అభ్యర్థులుగా ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి...... కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ , నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లను..... తిరిగి బరిలో నిలిపింది. ప్రస్తుతం సోయం బాపూరావు ప్రాతినిధ్యంవహిస్తున్న.... ఆదిలాబాద్‌కు మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి నుంచి...మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపనున్నట్టు తెలిపింది. భారాస నుంచి.... నిన్ననే భాజపాలో చేరిన ప్రస్తుత ఎంపీ బిబి పాటిల్‌ను ఆయన సిట్టింగ్‌ స్థానం జహీరాబాద్ నుంచి పోటీలో నిలిపింది. అంతా ఊహించినట్టే..... భువనగిరి నుంచి బూరనర్సయ్యగౌడ్‌, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను.... బరిలో నిలపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్‌ను...... పోటీలో నిలపనున్నట్టు భాజపా వెల్లడించింది. ఇంకా ఆదిలాబాద్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, నల్గొండ మహబూబ్‌నగర్‌, మెదక్‌, పెద్దపల్లిలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.


తెలంగాణ-భాజపా లోక్‌సభ అభ్యర్థులు

సికింద్రాబాద్ కిషన్ రెడ్డి

కరీంనగర్ బండి సంజయ్

నిజామాబాద్ ధర్మపురి అర్వింద్‌

మల్కాజిగిరి ఈటల రాజేందర్‌

జహీరాబాద్‌ బి.బి. పాటిల్‌

భువనగిరి బూరనర్సయ్యగౌడ్‌

చేవెళ్ల కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్ మాధవీలత

నాగర్ కర్నూలు భరత్ ప్రసాద్‌

మరోవైపు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో.. 370 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్న భారతీయ జనతాపార్టీ... 195మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ..వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. కేంద్ర హోంమంత్రిఅమిత్ షా.... గాంధీనగర్ నుంచి పోటీ చేయనుండగా..... లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోటా నుంచి బరిలోకి దిగనున్నారు. మొత్తం.... 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టు బీజేపీ ప్రకటించింది. ఇందులో... ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సహా 34 మంత్రులు, ఇద్దరు మాజీ మంత్రులకు....... చోటు కల్పించినట్టు.... భాజపా ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే వెల్లడించారు. గతనెల 29 నుంచి పలు విడతల్లో విస్తృత సంప్రదింపులు జరిపిన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ.. 195మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు తావ్డే తెలిపారు. ఇందులో...... మొత్తం 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఉన్నట్టు వివరించారు.

Tags

Next Story