Telangana: స్టేట్ vs సెంట్రల్

మరోసారి కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా ఎపిసోడ్ మారింది. రెండు ప్రభుత్వాల మధ్య స్మార్ట్ సిటీ నిధులు విడుదల పంచాయితీ కొనసాగుతోంది. తాము నిధులు విడుదల చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని లేకపోతే ఇకపై నిధులు విడుదల చేయబోమని కేంద్రం చెబుతోంది. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద గ్రేటర్ వరంగల్, కరీంనగర్ నగరాలు ఎంపికయ్యాయి. కాగా వీటికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు విడుదల చేయాలి. అయితే తాము 500 కోట్లు విడుదల చేసినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదని కేంద్రం ప్రశ్నిస్తోంది. జూన్ 23తో ఎంపికైన నగరాల్లో ప్రాజెక్టులు పూర్తి అవుతాయని తెలియజేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com