Telangana Weather: ఈ సమయాల్లో బయటకు రావొద్దంటున్న వైద్యులు.. దీంతో పాటు పలు సూచనలు..

Telangana Weather: ఈ సమయాల్లో బయటకు రావొద్దంటున్న వైద్యులు.. దీంతో పాటు పలు సూచనలు..
Telangana Weather: భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది.

Telangana Weather: భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఎండల తీవ్రత, వడగాల్పులతో జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని చోట్ల వడదెబ్బ కారణంగా ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు అన్నారు. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసమైతేనే ఇంటి నుండి బయటికి రావాలన్నారు.

బయటికి వస్తే గొడుగు, తలకు రుమాలు కట్టుకుని వెళ్లాలని సూచించారు. ఇక రోజుకు 4 లీటర్ల వాటర్ తీసుకోవాలని.. చెమట పట్టక పోవడం, హార్ట్ బీట్‌లో మార్పులు, పెదవులు ఎండి పోవడం, కళ్లు తిరగడం వంటివి ఎండ దెబ్బ లక్షణాలన్నారు. చిన్నారులు, గర్భిణులు చాల జాగ్రత్తగా ఉండాలన్నారు డిహెచ్. ఓ వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే.. మరో వైపు వాహ‌నాల కాలుష్యం తోడవ్వడంతో.. వేడి తీవ్ర మరింత పెరుగుతుంది.

అంతే కాకుండా చెట్లు నాట‌క పోగా ఉన్న చెట్లను న‌రికి వేస్తుండ‌టంతో ఇది గ్లోబ‌ల్ వార్మింగ్‌కు కార‌ణం అవుతుంనేది బ‌హిరంగా స‌త్యం. ఎండ వేడి.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా ఈ స్థాయి వడ‌గా‌డ్పులు మే నెలలో గానీ రావు. కానీ, ఈ ఏడాది మాత్రం మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే వీస్తుం‌డటం ఆందో‌ళన కలి‌గి‌స్తోంది. ఈ వేడి కారణంగా గాలిలో తేమ అసాధారణ స్థాయిలో తగ్గి పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోతలు అధికమవుతాయని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story