Ibrahimpatnam: మంత్రి హరీష్‌రావు పర్యటనలో ఉద్రిక్తత

Ibrahimpatnam: మంత్రి హరీష్‌రావు పర్యటనలో ఉద్రిక్తత

సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు మంత్రి హరీష్‌రావు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించిన ఆయన.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు సేవ చేసే నాయకులే కావాలి.. ఆడంబరాలకు పోయి హడావుడి చేసే నేతలను గుర్తించి తగిన బుద్ది చెప్పాలని ప్రజలకు సూచించారు. కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలోనే బయటికి వస్తున్నాయని విమర్శించారు. ఉచిత కరెంట్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు మంత్రి హరీష్‌రావు పర్యటనలో ఉద్రిక్తత తలెత్తింది. అభివృద్ధి శిలాఫలకాలపై తమ పేర్లు లేకపోవడంతో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. యాంజాల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సహా కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్‌ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. హరీష్‌రావు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లకుండా యాంజాల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ను అరెస్ట్‌ చేయడం ఏంటని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Tags

Read MoreRead Less
Next Story