Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

హైదరాబాద్‌లో PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ వర్గీయులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్-TRS వర్గీయుల బాహాబాహీతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరస్పరం కర్రలు, రాళ్ల దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రభుత్వంపైన, మంత్రి KTRపైన రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ TRS కార్యకర్తలు ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రేవంత్ దిష్టిబొమ్మ దగ్దం చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. TRS వాళ్లకు దీటుగా బదులిస్తూ కౌంటర్లు వేశారు. చివరకు పోలీసులు ఇరువర్గాల్ని చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
నిన్నటి వరకూ మంత్రి KTR- రేవంత్‌రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ జరిగితే.. ఇప్పుడు ఏకంగా కార్యకర్తల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విడతల వారీగా TRS వర్గీయులు రేవంత్ ఇంటి ముట్టడికి వస్తారనే సమాచారంతో ముందు జాగ్రత్తగా అక్కడ అదనపు బలగాల్ని మోహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com