MEDIGADDA: "మేడిగడ్డ"పై సర్వత్రా ఆందోళన

MEDIGADDA: మేడిగడ్డపై సర్వత్రా ఆందోళన
వంతెన దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు... బ్యారేజీ సమీపంలోనే సమీక్ష

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతమేర కుంగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వంతెన 20వ పిల్లర్ బేస్‌మెంట్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ENC నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతి రావు... ఇతర అధికారులు, గుత్తేదారులు ఇంజనీరింగ్ నిపుణులు వంతెన దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులు, ఇతర అధికారులు బ్యారేజీ సమీపంలోనే సమీక్ష చేపట్టారు. తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై రాకపోకలు సాగించే వంతెన శనివారం రాత్రి వంతెన కుంగడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు ప్రారంభించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ రాకపోకలు సాగించే వంతెన కుంగడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు చేపట్టారు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 2 టీఎంసీల నీరు ఉంది. ఇటు వంతెన ఏ మేరకు దెబ్బతిందనే విషయమై అధికారులు ఘటనాస్ధలికి వెళ్లి....పరిశీలించారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష చేసి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. బ్యారేజీ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించట్లేదు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బ్యారేజీ గేట్లను మూసివేశారు.


మేడిగడ్డ బ్యారేజీ పై వంతెన కుంగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు ఇటు మహారాష్ట్రంలోని సిరోంచ, భూపాలపల్లిలోని మహదేవ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం 6గంటల 20 నిమిషాల వద్ద భారీ శబ్దం వినిపించిందని వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్లాక్ నెంబర్ 7 లోని 19, 20, 21 పిల్లర్లు దెబ్బతిన్నాయని మహారాష్ట్ర వైపు ఉన్న పిల్లర్ 20 పైనున్న గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సాంఘిక శక్తుల ప్రమేయం ఉండచ్చని అనుమానిస్తున్నామని దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా అధికారులు పోలీసులకు వివరించారు.

మేడిగడ్డ బ్యారేజీపై రాకపోకలు సాగించే వంతెన కుంగడంపై బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. ఘటనపై సిట్టింగ్‌ జడ్జి సహా CVCతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి వైఖరి వల్ల కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా మారిందన్న బీజేపీ.. వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story