TG: కాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి ఫలితాలు కాసేపట్లో విడుదల చేయనున్నారు. మార్కుల మెమో ముద్రణపై స్పష్టత రావడంతో కాసేపట్లో ఫలితాలు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి మార్కుల మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్స్‌ను సైతం ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఏప్రిల్ 8న పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపించింది. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో నేడు ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి పదోతరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తీసివేయనున్నారు. పదోతరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతోపాటు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ ముద్రించే వాళ్లు. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్స్ రద్దు చేయనున్నారు. ఫలితాల కోసం విద్యార్థుల, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మెమో ఎలా ఉంటుంది..?
**ఈ ఏడాది పాస్ అయ్యే పదోతరగతి విద్యార్థులకు వచ్చే మార్క్‌షీట్‌లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీపీఏ కనిపించదు. సబ్జెక్టులవారీ వచ్చే మార్కులతోపాటు, ఇంటర్నల్ మార్క్‌లతో కలిపి మొత్తం మార్కులు, గ్రేడుగా పేర్కొంటారు. లాస్ట్‌లో విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? ముద్రిస్తారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో గ్రేడ్లు ఇస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com