TG: నేటి నుంచే పదో తరగతి పరీక్షలు

TG: నేటి నుంచే పదో తరగతి పరీక్షలు
X

తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనుండగా.. 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్షకు గంట ముందే కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యా నిపుణులు సూచించారు. విద్యార్థులు అద్భుతంగా.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి. ఈ ఏడాది 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. అడిషనల్స్‌ ఉండవు. సమాధానాలు మొత్తం అందులోనే రాయాలి. ముందు బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించండి. ప్రతి ప్రశ్నకు సక్రమమైన, నైపుణ్యంతో కూడిన సమాధానాలు ఇవ్వండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. విద్యార్థులకు మానసికంగా మద్దతును ఇవ్వండి.

Tags

Next Story