AMIT SHAH: దశాబ్దాల రైతుల కలను నెరవేర్చాం: అమిత్ షా

AMIT SHAH: దశాబ్దాల రైతుల కలను నెరవేర్చాం: అమిత్ షా
X
నిజమాబాద్‌లో పర్యటించిన అమిత్ షా... పసుపు బోర్డు కార్యాలయం ఆరంభం

ని­జా­మా­బా­ద్‌ రై­తు­లు పసు­పు­బో­ర్డు కోసం 40 ఏళ్ల పాటు పో­రా­టం చే­శా­ర­ని కేం­ద్ర­మం­త్రి అమి­త్​ షా గు­ర్తు చే­శా­రు. ని­జా­మ­బా­ద్‌­లో పసు­పు­బో­ర్డు జా­తీయ కా­ర్యా­ల­యా­న్ని ప్రా­రం­భిం­చిన అనం­త­రం స్థా­నిక పా­లి­టె­క్ని­క్‌ గ్రౌం­డ్స్​­లో ఏర్పా­టు చే­సిన రైతు సమ్మే­ళన సభలో ఆయన ప్ర­సం­గిం­చా­రు. ని­జా­మా­బా­ద్‌ రై­తు­లు పం­డిం­చిన పసు­పు భవి­ష్య­త్‌­లో ప్ర­పం­చ­మం­తా ఎగు­మ­తి అవు­తుం­ద­న్నా­రు. పసు­పు­బో­ర్డు కా­ర్యా­ల­యం ఏర్పా­టు­తో స్థా­నిక రై­తు­ల­కు ఎన్నో ప్ర­యో­జ­నా­లు కల­గ­ను­న్నా­య­ని ఆయన చె­ప్పా­రు. భా­ర­త్‌ ఆర్గా­ని­క్‌ లి­మి­టె­డ్‌, భా­ర­త్‌ ఎక్స్‌­పో­ర్టు లి­మి­టె­డ్‌ కూడా ని­జా­మా­బా­ద్‌­లో­నే ఏర్పా­ట­వు­తు­న్నా­య­ని వి­వ­రిం­చా­రు. భా­ర­త్‌ ఎక్స్‌­పో­ర్టు లి­మి­టె­డ్‌­తో ని­జా­మా­బా­ద్‌ పసు­పు అమె­రి­కా, యూ­ర­ప్‌­కు ఎగు­మ­తి అవు­తుం­ద­ని అమి­త్ షా వె­ల్ల­డిం­చా­రు.

అధికారంలోకి వస్తాం - అమిత్ షా

తె­లం­గా­ణ­లో బీ­జే­పీ అధి­కా­రం­లో­కి రా­వ­టం ఖా­య­మ­న్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్, కాం­గ్రె­స్ అవి­నీ­తి పా­ర్టీ­ల­ని దు­య్య­బ­ట్టా­రు. కాం­గ్రె­స్‌ పా­ర్టీ తె­లం­గా­ణ­ను ఢి­ల్లీ­కి ఏటీ­ఎం­గా మా­ర్చే­సిం­ద­ని ఆరో­పిం­చా­రు. తె­లం­గా­ణ­లో బీ­ఆ­ర్ఎ­స్ పో­యిం­ది కానీ… అవి­నీ­తి పో­లే­ద­న్నా­రు. ఇచ్చిన హామీ ప్ర­కా­రం ఎంపీ అర్విం­ద్‌ ని­జా­మా­బా­ద్‌­కు పసు­పు బో­ర్డు సా­ధిం­చా­ర­ని అమి­త్ షా ప్ర­శం­సిం­చా­రు. పసు­పు రై­తు­ల­కు ప్ర­ధా­ని ఇచ్చిన హామీ నె­ర­వే­రిం­ద­న్నా­రు. దే­శం­లో­ని పసు­పు రై­తు­ల­కు అభి­నం­ద­న­లు తె­లు­పు­తు­న్నా­న­ని… పసు­పు బో­ర్డు వల్ల ప్ర­పం­చం­లో­ని పలు దే­శా­ల­కు ని­జా­మా­బా­ద్‌ పసు­పు వె­ళ్తుం­ద­ని చె­ప్పా­రు. ఈ సభ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని… పాకిస్థాన్‌ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని విమర్శించారు. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని వ్యాఖ్యానించారు.

దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం

మా­వో­యి­స్టు­లు తక్ష­ణ­మే హత్యా­కాండ ఆపే­సి లొం­గి­పో­వా­ల­ని కేం­ద్ర హోం మం­త్రి అమి­త్‌ షా అన్నా­రు. ‘పహ­ల్గాం­లో ఉగ్ర­దా­డి­తో పా­కి­స్థా­న్‌ మన­ల్ని భయ­పె­ట్టా­ల­ని చూ­సిం­ద­ని ఆ తర్వాత భా­ర­త్‌ శక్తి ఏమి­టో ఆదే­శా­ని­కి, ప్ర­పం­చా­ని­కి తె­లి­సిం­ది అని అమి­త్​­షా పే­ర్కొ­న్నా­రు. ఉగ్ర­వా­దా­న్ని మా­త్ర­మే కా­కుం­డా దే­శం­లో­ని నక్స­లి­జం కూడా లే­కుం­డా చే­యా­ల­న్న­దే మోదీ లక్ష్య­మ­ని స్ప­ష్టం చే­శా­రు. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా? మీరే చెప్పండని అక్కడ ఉన్న సభికుల్ని ఉద్దేశించి అమిత్​షా అన్నారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కోరారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని అమిత్​షా పిలుపునిచ్చారు.

Tags

Next Story