TERROR: హైదరాబాద్‌లో సామూహిక హత్యలకు ప్లాన్..!

హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మొహియు్దీన్ సయ్యద్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఈ ఉగ్రవాదిని మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అహ్మద్.. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. రాజేంద్ర నగర్ సర్కిల్ ఫోర్ట్ వ్య కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్...చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తరువాత ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పని చేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో పాకిస్తానీహ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ తో దాడులు చేసేందుకు ప్లాన్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో రిసిన్ ఒకటి. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. దీనిని ఎందులో కలిపినా ఎవరూ గుర్తుపట్టలేరు. చివరకు నీళ్ళల్లో కలిపినా కూడా తెలియదు. అందుకే ప్రజలను చంపేందుకు దీనిని ఈ డాక్టర్ ఉగ్రవాది ఎంచుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ పాయిజన్ ను దేశంలోని ప్రధాన నగరాల్లో మంచి నీళ్ళు, గుడి ప్రసాదాల్లో కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు డాక్టర్ సయ్యద్ మొహయుద్దీన్. విషాన్ని ఇవ్వడం ద్వారా దేశంలో వేలాది మంది మరణించేలా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మరోసారి ఏటీఎస్ తనిఖీలు
తాజాగా మరోసారి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరోసారి తనిఖీలను చేపట్టింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్ లలో సోదాలు చేసింది. రాజేంద్రనగర్‌లోని పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు స్పెషల్ ఏటీఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో గంటన్నరకు పైగా సోదాలు చేసింది. వీటిల్లోరెసిన్ చేసే యంత్రాలు, అది ఎలా తయారు చేయాలో తెలిపే బుక్స్ తో పాటూ భారీగా రైసిన్ విషపదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలు పట్టుబడ్డాయి. వీటన్నింటినీఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. అలాగే మరోవైపు ఏపీలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్కడ కూడా సలీపర్ సెల్ పాగా వేసినట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించాలని డిసైడ్ అయింది. గుంటూరులో ముంబై ఏటీఎస్ దాడులు చేస్తోంది. ఉగ్రవాదులకోసం సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది. సయ్యద్ నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్లు, నాలుగు లీటర్ల కాస్టర్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ATS తెలిపింది. అవికాకుండా మూడు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను కూడా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

