Terrorist : హైదరాబాద్ లో ఉగ్రకుట్ర.. వికారాబాద్ లో ట్రైనింగ్

హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగర శివారులోని వికారాబాద్ అనంతగిరి గుట్టలో నిందితులు శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తుపాకులు పేల్చడం, కత్తులు, గొడ్డళ్లతో దాడికి శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తుంది. 48 గంటలపాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండేందుకు కూడా ట్రేనింగ్ తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా యూట్యూబ్‌లో చూసి యువకులు ఫిట్‌నెస్ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ప్రభుత్వ కార్యాలయాల్లో దాడులకు ప్లాన్ చేసి... ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని స్కెచ్ వేశారని పోలీసులు వెల్లడించారు. మాల్స్‌పై దాడి చేసి తమ ఆధీనంలో ఉంచుకునేందుకు భారీ కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు యాసిర్ నేతృత్వంలో ప్రత్యేకంగా టీమ్ రెడీ అయిందన్నారు. ఇప్పటివరకు యాసిర్ 50 మందిని చేర్చుకున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పట్టుబడిన నిందితులకు హిజబ్ ఉత్ తెహ్రిర్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఇస్లామిక్ రాజ్యస్థాపన లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశాలను టార్గెట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం 50 దేశాల్లో హెచ్‌యూటీ కార్యకలాపాలు కొనసాగుతుండగా.. 16 దేశాల్లో ఈ ఉగ్రవాద సంస్థపై నిషేధం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అరెస్టయినా ఆరుగురు నిందితులను ఏటీఎస్ కస్టడీకి భూపాల్‌లోని ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈ నెల 19 వరకు వీరు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com