Hyderabad Terrorists : మరో ఉగ్రవాది మొహమ్మద్ జావెద్ అరెస్ట్..

Hyderabad Terrorists : మరో ఉగ్రవాది మొహమ్మద్ జావెద్ అరెస్ట్..
Hyderabad Terrorists : దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలోఉగ్రదాడులు జరిగినా.... వాటి మూలాలు మాత్రం హైదరాబాద్‌లో బయటపడటం ఆందోళన కల్గిస్తోం

Hyderabad Terrorists : దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలోఉగ్రదాడులు జరిగినా.... వాటి మూలాలు మాత్రం హైదరాబాద్‌లో బయటపడటం ఆందోళన కల్గిస్తోంది. మక్కామసీదు పేలుళ్లకేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొహమ్మద్ జాహేద్ ను అదుపులోకి తీసుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఇంటలిజెన్స్ హెచ్చరికలతో అతనితోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించిన ఆధార్ కార్డ్స్, పాస్ ఫోర్ట్, బర్త్ సర్టిఫికెట్ లను స్వాధీనం చేసుకున్నారు.

దేశంలో ఒక్కో ఉగ్రకుట్రను నిఘాసంస్థలు వెలుగులోకి తెస్తున్నాయి. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు పన్నిన కుట్రలను భగ్నం చేస్తున్నాయి. జాతాగా హైదరాబాద్‌లోని మూసారాంబాంగ్‌కుచెందిన మొహ్మద్ జాహీద్ ను టాస్క్‌ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని గతంలో మక్కామసీదు పేలుళ్లకేసులో పోలీసులు విచారించి .. వదిలిపెట్టారు. ఆదివారం తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకున్నపోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. అయితే జాహిద్ కు పలు టెర్రరిస్టుగ్రూపులతో లింకు ఉన్నట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఇంటలీజెన్స్ అధికారులు అందించిన సమాచారంతో తెల్లవారుజామను జాహిద్‌ను అదుపులోకితీసుకున్నారు. ఇతనితోపాటు.. చంపాపేట్, బాబానగర్ నగర్‌కు చెందిన మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీరికి సంబంధించిన ఆధార్ కార్డు, పాస్ ఫోర్టు, బర్త్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిని రహస్యప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలు.. తాజాగా వెలుగు చూసిన పిఎఫ్‌ఐ కుట్రల్లో వీరిభాగస్వామ్యంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లుతెలుస్తోంది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు దేశంలో తీవ్రకలకలం రేపుతున్నాయి. నిఘా సంస్థల సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ, ఆర్ ఎస్‌ఎస్ ప్రముఖులను హత్యచేసేందుకు పన్నిన కుట్రల భగ్నమయ్యాయి. తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, అసోం, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి మొత్తం 250మందిని అరెస్టుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story