TERRORISTS: ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు

TERRORISTS: ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు
X
చెర నుంచి విడిపించాలంటూ తల్లిదండ్రుల వేడుకోలు

ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ప్రవీణ్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. గత నెల 23న విధులు ముగించుకుని వస్తుండగా JNIM ఉగ్రవాద సంస్థకు చెందిన దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ప్ర­తి రోజూ ఉదయం 9 గంటల సమ­యం­లో తల్లి­దం­డ్రు­ల­తో మా­ట్లా­డే­వా­డు. గత నెల 22న అతడు ఇం­టి­కి చి­వ­రి కాల్ చే­శా­డు. ఆ తర్వా­తి రోజు నుం­చి అతడి ఫోన్ స్వి­చ్ ఆఫ్‌­లో ఉం­డ­డం­తో తల్లి­దం­డ్రు­లు ఆం­దో­ళ­న­కు గు­ర­య్యా­రు. ఈ నెల 4న బో­ర్‌­వె­ల్ కం­పె­నీ ప్ర­తి­ని­ధు­లు ప్ర­వీ­ణ్ తల్లి­దం­డ్రు­ల­కు ఫోన్ చేసి అతడు కి­డ్నా­ప్ అయ్యా­డ­ని సమా­చా­రం అం­ద­జే­శా­రు. కాగా, 23న ప్ర­వీ­ణ్ వి­ధు­లు ము­గిం­చు­కు­ని తాను ఉం­టు­న్న గది వద్ద­కు వె­ళ్తుం­డ­గా జే­ఎ­న్‌­ఐ­ఎం సం­స్థ­కు చెం­దిన ఉగ్ర­వా­దు­లు కి­డ్నా­ప్ చే­శా­ర­ని తె­లి­పా­రు. గతం­లో­నూ ఆ ప్రాం­తం­లో అదే సం­స్థ­కు చెం­దిన ఉగ్ర­వా­దు­లు కొం­త­మం­ది వి­దే­శీ­యు­ల­ను కి­డ్నా­ప్ చే­శా­రు. బో­ర్‌­వె­ల్ కం­పె­నీ ప్ర­తి­ని­ధు­లు భారత రా­య­బార కా­ర్యా­ల­యం అధి­కా­రు­ల­తో ప్ర­వీ­ణ్ ఆచూ­కీ కోసం సం­ప్ర­దిం­పు­లు జరు­పు­తు­న్నా­రు. ఈ క్ర­మం­లో­నే ప్ర­వీ­ణ్ కు­టుంబ సభ్యు­లు తమ కు­మా­రు­డి­ని ఉగ్ర­వా­దుల చెర నుం­చి వి­డి­పిం­చా­ల­ని భారత ప్ర­భు­త్వా­ని­కి వి­జ్ఞ­ప్తి చే­స్తు­న్నా­రు.

Tags

Next Story