TG: టెట్ షెడ్యూల్ విడుదల

X
By - Sathwik |12 April 2025 8:00 AM IST
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 30వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచుతారు. జులై 22న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏడాదిలో రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2.75లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 2లక్షల మందికి పైగా హాజరయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com