TG: తెలంగాణ హోంమంత్రిగా అజారుద్దీన్..!

TG: తెలంగాణ హోంమంత్రిగా అజారుద్దీన్..!
X
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. అజారుద్దీన్‌కు దక్కిన అమాత్యయోగం.. హోం, మైనార్టీ శాఖలు అప్పగించే ఛాన్స్

తె­లం­గాణ కే­బి­నె­ట్‌­లో­కి మాజీ భారత క్రి­కె­ట­ర్‌, కాం­గ్రె­స్ నేత మహ­మ్మ­ద్‌ అజా­రు­ద్దీ­న్‌ రా­ను­న్నా­రు. ఎల్లుం­డి ఆయన మం­త్రి పద­వి­కి ప్ర­మా­ణ­స్వీ­కా­రం చే­య­ను­న్నా­రు. ఇటీ­వల గవ­ర్న­ర్‌ కోటా ద్వా­రా ఎమ్మె­ల్సీ­గా అజా­రు­ద్దీ­న్‌ పే­రు­ను రా­ష్ట్ర ప్ర­భు­త్వం ప్ర­తి­పా­దిం­చిం­ది. ఆ ప్ర­తి­పా­ద­న­కు ఆమో­దం లభిం­చ­డం­తో మం­త్రి పదవి ఇవ్వా­ల­ని సీఎం రే­వం­త్‌ రె­డ్డి ని­ర్ణ­యిం­చా­రు. మం­గ­ళ­వా­రం సా­యం­త్రం ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌ రె­డ్డి­ని కలి­సిన అజా­రు­ద్దీ­న్‌, తనకు ఇచ్చిన అవ­కా­శం­పై కృ­త­జ్ఞ­త­లు తె­లి­పా­రు. పా­ర్టీ పట్ల ని­బ­ద్ధ­త­తో పని­చే­స్తా­న­ని, రా­ష్ట్ర అభి­వృ­ద్ధి కోసం కృషి చే­స్తా­న­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. అజా­రు­ద్దీ­న్‌ మం­త్రి పద­వి­లో­కి రా­వ­డం ద్వా­రా ఓల్డ్ సి­టీ­లో కాం­గ్రె­స్‌ స్థా­యి­లో కొ­త్త ఉత్సా­హం నె­ల­కొ­నే అవ­కా­శ­ముం­ది. ఓల్డ్ సిటీ ము­స్లిం ఓట­ర్ల­ను ఆక­ర్షిం­చేం­దు­కు, మై­నా­ర్టీ వర్గాల మద్ద­తు­ను బలో­పే­తం చే­సేం­దు­కు ఈ ని­ర్ణ­యం కీ­ల­కం­గా మా­ర­నుం­ది. ప్ర­ముఖ క్రి­కె­ట­ర్‌­గా భారత జట్టు­కు కె­ప్టె­న్‌­గా వ్య­వ­హ­రిం­చిన అజా­రు­ద్దీ­న్‌ 2019లో తె­లం­గాణ కాం­గ్రె­స్‌ కమి­టీ అధ్య­క్షు­డి­గా కూడా బా­ధ్య­త­లు ని­ర్వ­హిం­చా­రు. ఇప్పు­డు రా­ష్ట్ర కే­బి­నె­ట్‌­లో కీలక బా­ధ్య­త­లు స్వీ­క­రిం­చ­ను­న్నా­రు.

మైనార్టీ వర్గానికి అవకాశం ఇవ్వాలనే..

ము­స్లిం మై­నా­ర్టీ వర్గా­ని­కి ఏదో వి­ధం­గా మం­త్రి­వ­ర్గం­లో స్థా­నం కల్పిం­చా­ల­నే ఆలో­చ­న­తో కాం­గ్రె­స్‌ అధి­ష్ఠా­నం ఉంది. అజా­హ­రు­ద్దీ­న్‌ జూ­బ్లీ­హి­ల్స్‌ అసెం­బ్లీ స్థా­నం నుం­చి పోటీ చేసి ఓటమి పా­ల­య్యా­రు. తా­జా­గా జరు­గు­తు­న్న జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­ల్లో పోటీ చే­సేం­దు­కు సి­ద్ధ­ప­డ్డా­రు. అయి­తే, ఆయ­న­కు కాం­గ్రె­స్‌ అధి­ష్ఠా­నం ఎమ్మె­ల్సీ పదవి కట్ట­బె­ట్టా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. గవ­ర్న­ర్‌ కోటా కింద ఎమ్మె­ల్సీ­లు­గా అజా­హ­రు­ద్దీ­న్‌, తె­లం­గాణ జన­స­మి­తి అధ్య­క్షు­డు కో­దం­డ­రా­మ్‌­ను కాం­గ్రె­స్‌ పా­ర్టీ ఎం­పిక చే­సిం­ది. అయి­తే, వీ­రి­ద్ద­రి ని­యా­మ­కా­ని­కి గవ­ర్న­ర్‌ ఇంకా ఆమో­దం తె­ల­ప­లే­దు. ఎమ్మె­ల్సీ ని­యా­మక ప్ర­క్రియ పూ­ర్తి­కా­క­పో­యి­న­ప్ప­టి­కీ అజా­హ­రు­ద్దీ­న్‌ మం­త్రి­గా ప్ర­మా­ణం చే­సేం­దు­కు ఏఐ­సీ­సీ ఆమో­దం తె­లి­పి­న­ట్టు సమా­చా­రం. మం­త్రి వర్గ వి­స్త­ర­ణ­పై గత రెం­డ్రో­జు­లు­గా ఏఐ­సీ­సీ­లో వి­స్తృ­తం­గా చర్చ జరి­గి­న­ట్టు తె­లు­స్తోం­ది. మొ­ద­టి సారి ము­ఖ్య­మం­త్రి­తో పాటు 12 మంది మం­త్రు­లు­గా ప్ర­మా­ణం చే­శా­రు. ఇటీ­వల జరి­గిన మం­త్రి­వ­ర్గ వి­స్త­ర­ణ­లో ము­గ్గు­రు మం­త్రు­లు­గా ప్ర­మా­ణం చే­శా­రు. ప్ర­స్తు­తం మరో ము­గ్గు­రి­కి మం­త్రి పద­వు­లు ఇచ్చేం­దు­కు అవ­కా­శం ఉంది.

Tags

Next Story