TG: "కొమురంభీమ్ కన్జర్వేషన్ కారిడార్" కు బ్రేక్

TG: కొమురంభీమ్ కన్జర్వేషన్ కారిడార్ కు బ్రేక్
X
జీవో 49ను నిలిపేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఆదివాసీల అనుమానాలతో నిలిపేస్తూ నిర్ణయం

ఉమ్మ­డి ఆది­లా­బా­ద్ జి­ల్లా­లో గి­రి­జ­ను­లు ఆగ్ర­హా­ని­కి గురి అవు­తు­న్న జీవో నెం­బ­ర్‌ 49పై తె­లం­గా­ణ­లో­ని కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ప్ర­స్తు­తా­ని­కి జీ­వో­ను ని­లి­పి­వే­స్తు­న్న­ట్టు ప్ర­క­టిం­చా­రు. దీ­ని­పై ఆది­వా­సీ­లు, నా­య­కు­లు ప్ర­భు­త్వా­ని­కి కృ­త­జ్ఞత తె­లి­పా­రు. ఉమ్మ­డి ఆది­లా­బా­ద్‌ జి­ల్లా­లో బం­ద్‌­కు పి­లు­పు­ని­చ్చిన రో­జు­నే ప్ర­భు­త్వం ఈ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఆది­వా­సీల అభి­ప్రా­యా­ల­ను పరి­గ­ణ­లో­కి తీ­సు­కు­ని, వారి ఆం­దో­ళ­న­ల­ను ని­వృ­త్తి చేసే వరకు జీవో అమ­లు­ను ని­లి­పి ఉం­చా­ల­ని ప్ర­భు­త్వం స్ప­ష్టం­చే­సిం­ది. కన్జ­ర్వే­ష­న్ కా­రి­డా­ర్‌ వల్ల తమ జీ­వ­నో­పా­ధి­పై ప్ర­భా­వం పడు­తుం­ద­ని ఆది­వా­సీ సం­ఘా­లు ఇటీ­వల పె­ద్దఎ­త్తున ని­ర­స­న­లు తె­లి­పిన వి­ష­యం తె­లి­సిం­దే. ప్ర­భు­త్వం ఈ అం­శం­పై మరి­న్ని చర్చ­లు జరి­పి, ప్ర­జల అను­మా­నా­ల­ను ని­వృ­త్తి చే­సిన తరు­వాత తగిన ని­ర్ణ­యం తీ­సు­కు­నే అవ­కా­శం ఉంది. ఉమ్మ­డి ఆది­లా­బా­ద్ జి­ల్లా­లో దా­దా­పు 3 లక్షల ఎక­రాల అటవీ భూ­మి­ని కొ­మ్రం­భీ­మ్‌ కన్జె­ర్వే­ష­న్ కా­రి­డా­ర్‌­గా మా­ర్చేం­దు­కు ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. ఈ మే­ర­కు జీవో నెం­బ­ర్ 49ను వి­డు­దల చే­సిం­ది. తమ ప్రాం­తా­న్ని ఇలా మా­ర్చ­డం­పై గి­రి­జ­నం ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. తాము అం­గీ­క­రిం­చే­ది లే­ద­ని చాలా కాలం నుం­చి పె­ద్ద ఎత్తున ఉద్య­మం చే­స్తు­న్నా­రు. దీం­తో సచి­వా­ల­యం­లో మం­త్రి సీ­త­క్క, ఆది­వా­సీ­లు సీఎం రే­వం­త్ రె­డ్డి­ని కలి­సి ధన్య­వా­దా­లు తె­లి­పా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ ఆది­వా­సీల పక్షాణ ఉం­టుం­ద­ని ఎమ్మె­ల్యే బొ­జ్జు పటే­ల్ అన్నా­రు. ఎన్ని చే­సి­నా ప్ర­భు­త్వం నుం­చి సా­ను­కూల స్పం­దన రా­క­పో­వ­డం­తో చి­వ­ర­కు ఉద్యమ పం­థా­ను అం­దు­కు­న్నా­రు.

కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఏంటి?

ప్ర­ధా­నం­గా, మహా­రా­ష్ట్ర­లో­ని తా­డో­బా పు­లుల సం­ర­క్షణ కేం­ద్రం, ఉమ్మ­డి ఆది­లా­బా­ద్‌­లో­ని కవ్వా­ల్ టై­గ­ర్ రి­జ­ర్వ్‌­ను అట­వీ­ప్రాం­తం గుం­డా కలి­పే కా­రి­డా­ర్ ప్రాం­తా­న్ని "కు­మ్రం భీమ్ కన్జ­ర్వే­ష­న్ రి­జ­ర్వ్'' గా ప్ర­క­టి­స్తూ మే 30,2025న తె­లం­గాణ ప్ర­భు­త్వం జీవో 49ను జారీ చే­సిం­ది. జా­తీయ వన్య­ప్రా­ణుల (సం­ర­క్షణ) చట్టం-1972 లోని 36-ఏ ని­బం­ధన ప్ర­కా­రం కన్జ­ర్వే­ష­న్ రి­జ­ర్వ్‌­గా డి­క్లే­ర్ చే­స్తు­న్న­ట్లు నో­టి­ఫి­కే­ష­న్‌­లో పే­ర్కొం­ది. ఈ ని­బం­ధన ప్ర­కా­రం.. స్థా­ని­కు­ల­తో సం­ప్ర­దిం­పుల అనం­త­రం అభ­యా­ర­ణ్యా­లు, వన్య­ప్రా­ణి రక్షిత ప్రాం­తా­ల­ను అను­సం­ధా­నిం­చే ప్రాం­తా­ల­ను అక్క­డి వృ­క్ష, జంతు జాలం , వాటి ఆవా­సా­ల­ను రక్షిం­చ­డా­ని­కి పరి­ర­క్షణ రి­జ­ర్వ్ ( కన్జ­ర్వే­ష­న్ రి­జ­ర్వ్) గా ఆయా రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు ప్ర­క­టిం­చ­వ­చ్చు. ము­ఖ్య­మం­త్రి దీ­ని­పై స్ప­దిం­చి జీవో 49ను ని­లి­పి­వే­యా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ఈ మే­ర­కు గి­రి­జన ప్ర­జ­ల­కు ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి శు­భ­వా­ర్త చె­ప్పా­రు. ప్ర­స్తు­త­ని­కి జీవో 49ను ని­లి­పే­స్తు­న్న­ట్టు ఆదే­శా­లు జారీ చే­సిన ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి­కి గి­రి­జన ఉద్యమ నా­య­కు­లు కృ­త­జ్ఞత తె­లి­పా­రు.

Tags

Next Story