TG CABINET: హైకోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలపై నిర్ణయం

TG CABINET: హైకోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలపై నిర్ణయం
X
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. ముగ్గురు పిల్లల నిబంధనపై ఆర్డినెన్స్ జారీ

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­పై తె­లం­గాణ మం­త్రి­వ­ర్గం సు­దీ­ర్ఘం­గా చర్చిం­చిం­ది. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై ఇప్ప­టి­కే హై­కో­ర్టు మధ్యం­తర తీ­ర్పు, సు­ప్రీం­కో­ర్టు తీ­ర్పుల నే­ప­థ్యం­లో.. న్యాయ ని­పు­ణుల సల­హా­లు, సూ­చ­నల ప్ర­కా­రం ప్ర­భు­త్వం ముం­దు­కు వె­ళ్లా­ల్సి ఉం­టుం­ద­ని క్యా­బి­నె­ట్‌ ని­ర్ణ­యిం­చిం­ది. బీ­సీ­ల­కు 42% రి­జ­ర్వే­ష­న్ల అంశం వచ్చే నెల 3న హై­కో­ర్టు­లో వి­చా­ర­ణ­కు రా­నుం­ది కా­బ­ట్టి.. ఆ రో­జున వె­లు­వ­డే ఆదే­శా­ల­కు అను­గు­ణం­గా ముం­దు­కు వె­ళ్లా­ల­ని సర్కా­ర్ ని­ర్ణ­యిం­చిం­ది. వచ్చే నెల 7న రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గం మరో­సా­రి సమా­వే­శ­మై స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­పై ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని తీ­ర్మా­నిం­చిం­ది. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి అధ్య­క్ష­తన మం­త్రి­వ­ర్గ సమా­వే­శం జరి­గిం­ది. ఆస్ట్రే­లి­యా పర్య­ట­న­లో ఉన్నం­దున.. ఈ సమా­వే­శా­ని­కి ఐటీ, పరి­శ్ర­మల శాఖ మం­త్రి దు­ద్ది­ళ్ల శ్రీ­ధ­ర్‌­బా­బు హా­జ­రు కా­లే­దు. క్యా­బి­నె­ట్‌­లో తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­ల­ను మం­త్రు­లు జూ­ప­ల్లి కృ­ష్ణా­రా­వు, వా­కి­టి శ్రీ­హ­రి, కొం­డా సు­రేఖ, పొ­న్నం ప్ర­భా­క­ర్, ఎంపీ బల­రాం నా­య­క్‌­ల­తో కలి­సి మం­త్రి పొం­గు­లే­టి శ్రీ­ని­వా­స­రె­డ్డి వి­లే­క­రుల సమా­వే­శం­లో వె­ల్ల­డిం­చా­రు. స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో పోటీ చే­సేం­దు­కు ప్ర­స్తు­తం అమ­ల్లో ఉన్న ఇద్ద­రు పి­ల్లల ని­బం­ధ­న­ను ఎత్తి­వే­సేం­దు­కు రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. అం­దు­కు వీ­లు­గా తె­లం­గాణ పం­చా­య­తీ­రా­జ్‌ చట్టం 2018లో సె­క్ష­న్‌ 21(3)ని తొ­ల­గిం­చా­ల­ని మం­త్రి­మం­డ­లి ని­ర్ణ­యిం­చిం­ది. అసెం­బ్లీ ప్రొ­రో­గ్‌ అయి­నం­దున చట్ట సవ­ర­ణ­కు గవ­ర్న­ర్‌ ఆమో­దం­తో ఆర్డి­నె­న్స్‌ తే­వా­ల్సి ఉం­టుం­ది. ఆర్డి­నె­న్స్‌ ప్ర­తి­పా­దన దస్త్రా­న్ని మం­త్రి­వ­ర్గం ఆమో­దిం­చిం­ది.

ముఖ్యమంత్రికి కొండా సురేఖ క్షమాపణలు

ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి­కి మం­త్రి కొం­డా సు­రేఖ క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­రు. తమ ఇం­టి­కి పో­లీ­సు­లు రా­వ­డం­తో మా కూ­తు­రు సు­ష్మిత ఆవే­శం­తో మా­ట్లా­డిం­ద­ని.. తమ కూ­తు­రు తర­పున తాను క్ష­మా­పణ అడు­తు­న్నా­న­ని సు­రేఖ అన్నా­రు. ప్ర­స్తు­తం తమ మధ్య ఎలాం­టి వి­భే­దా­లు లేవు.. త్వ­ర­లో­నే అన్నీ సమ­సి­పో­తా­య­ని కొం­డా సు­రేఖ స్ప­ష్టం చే­శా­రు. కొం­డా సు­రేఖ వ‌­ద్ద ఓఎ­స్‌­డీ­గా ప‌ని చే­సిన సు­మం­త్‌­ను అరె­స్టు చే­సేం­దు­కు వె­ళ్ల­‌­డం చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. ఎలాం­టి నో­టీ­సు­లు లే­కుం­డా మం­త్రి ఇం­టి­కి వ‌­స్తా­ర­‌­ని ప్ర­‌­శ్ని­స్తూ.. కొం­డా సు­రేఖ కూ­తు­రు సు­స్మిత పో­లీ­సు­ల­‌­ను అడ్డు­కు­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం రే­వం­త్­పై ఘాటు వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఉద్దే­శ­‌­పూ­ర్వ­‌­కం­గా­నే బీసీ మం­త్రి అయిన కొం­డా సు­రే­ఖ­‌­ను సీఎం, మం­త్రి పొం­గు­లే­టి, వేం న‌­రేం­ద­‌­ర్‌­రె­డ్డి టా­ర్గె­ట్ చే­శా­రం­టూ సు­స్మిత సం­చ­‌­ల­‌న ఆరో­ప­‌­ణ­‌­లు చే­శా­రు.

Tags

Next Story