TG: పురపాలక పోరులో హస్తం పార్టీదే పై "చేయి"

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ తన రాజకీయ బలాన్ని మరొకసారి చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1,347 వార్డుల్లో గెలుపొందింది. దీంతో మొత్తం 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫలితాలు వెల్లడవుతున్న కొద్దీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇతర పార్టీల ఫలితాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ 717 వార్డుల్లో విజయం సాధించి 13 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీజేపీ 261 వార్డులు గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థులు 256 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తంగా 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నేరేడు చర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, చెన్నూరు, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్నేక మున్సిపాలిటీల్లో విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ నేరేడు చర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, చెన్నూరు, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, రామాయంపేట, హుజూరాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్‌ఘన్‌పూర్, మధిర, అశ్వారావుపేట, ఇల్లెందు, ములుగు, యాదిగిరిగుట్ట, ఆలేరు వంటి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి, ఆమన్‌గల్, సిరిసిల్ల మున్సిపాలిటీలలో ఆధిపత్యం సాధించింది. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ 8, భాజపా 1, సీపీఎం 1, ఇతరులు 6 స్థానాలు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సీపీఐకి మద్దతు ఇవ్వడానికి బీఆర్ఎస్ ముందుకు రావడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. నారాయణపేట జిల్లా మక్తల్ పురపాలికలో ఆరవ వార్డు ఎస్టీకి రిజర్వ్ అయింది. అక్కడ భాజపా అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో ఆ వార్డులో పోలింగ్ జరగలేదు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. మక్తల్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్ 12, భాజపా 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఖమ్మం జిల్లా మధిర 10వ వార్డులో తెదేపా అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించగా, చిట్యాల మొదటి వార్డులో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సుధాకర్ గెలుపొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
