TG: 85 చోట్ల కాంగ్రెస్‌.. 17 స్థానాల్లో బీఆర్‌ఎస్‌

TG: 85 చోట్ల కాంగ్రెస్‌.. 17 స్థానాల్లో బీఆర్‌ఎస్‌
X
105 స్థానాల్లో మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక పూర్తి... మరికొన్నిచోట్ల నేటికి వాయిదా పడిన ఎన్నిక

తె­లం­గాణ రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ము­న్సి­ప­ల్‌ ఛై­ర్మ­న్‌, వై­స్‌ ఛై­ర్మ­న్‌ ఎన్ని­కల ప్ర­క్రియ ప్ర­ధా­నం­గా ము­గి­సిం­ది. మొ­త్తం 116 ము­న్సి­పా­లి­టీ­ల­కు ఈ నెల 11న ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చ­గా, వా­టి­లో 105 ము­న్సి­పా­లి­టీ­ల్లో ఛై­ర్మ­న్‌, వై­స్‌ ఛై­ర్మ­న్‌ల ఎన్నిక వి­జ­య­వం­తం­గా పూ­ర్త­య్యా­యి. మరో 11 ము­న్సి­పా­లి­టీ­ల్లో ఎన్ని­క­లు వా­యి­దా పడ్డా­యి. ఎన్ని­క­లు జరి­గిన 105 ము­న్సి­పా­లి­టీ­ల్లో కాం­గ్రె­స్‌ పా­ర్టీ స్ప­ష్ట­మైన ఆధి­ప­త్యం చా­టు­కుం­ది. మొ­త్తం 84 స్థా­నా­ల­ను కాం­గ్రె­స్‌ గె­లు­చు­కో­గా, బీ­ఆ­ర్‌­ఎ­స్‌ 17 స్థా­నా­లు దక్కిం­చు­కుం­ది. ఒక ము­న్సి­పా­లి­టీ­లో బీ­జే­పీ వి­జ­యం సా­ధిం­చ­గా, మూడు చో­ట్ల స్వ­తం­త్ర అభ్య­ర్థు­లు ఛై­ర్మ­న్లు­గా ఎన్ని­క­య్యా­రు. ఎన్ని­కల ఫలి­తా­లు వె­ల్ల­డైన సమ­యా­ని­కి 90 ము­న్సి­పా­లి­టీ­ల్లో వి­విధ రా­జ­కీయ పా­ర్టీ­ల­కు స్ప­ష్ట­మైన మె­జా­ర్టీ లభిం­చిం­ది. అయి­తే 36 ము­న్సి­పా­లి­టీ­ల్లో హం­గ్‌ పరి­స్థి­తి నె­ల­కొం­ది. ఈ నే­ప­థ్యం­లో కొ­న్ని­చో­ట్ల రా­జ­కీయ పా­ర్టీల మధ్య పొ­త్తు­లు కు­ది­రి, స్వ­తం­త్ర అభ్య­ర్థుల మద్ద­తు­తో ఛై­ర్‌­ప­ర్స­న్‌­ల­ను ఎన్ను­కు­న్నా­రు. దీం­తో కొ­న్ని ము­న్సి­పా­లి­టీ­ల్లో అధి­కార పా­ర్టీ­లు వ్యూ­హా­త్మ­కం­గా వ్య­వ­హ­రిం­చి ఆధి­క్యా­న్ని సా­ధిం­చా­యి. మరో­వై­పు రా­ష్ట్రం­లో­ని మొ­త్తం ఏడు ము­న్సి­ప­ల్‌ కా­ర్పొ­రే­ష­న్ల­లో కూడా కాం­గ్రె­స్‌ పా­ర్టీ ఆధి­ప­త్యం ప్ర­ద­ర్శిం­చిం­ది. ఏడు కా­ర్పొ­రే­ష­న్ల­లో ఐదు కాం­గ్రె­స్‌ ఖా­తా­లో­కి వె­ళ్లా­యి. ఒక కా­ర్పొ­రే­ష­న్‌­ను సీ­పీఐ-కాం­గ్రె­స్‌ మి­త్ర­ప­క్షం గె­లు­చు­కో­గా, మరొ­క­దా­న్ని బీ­జే­పీ కై­వ­సం చే­సు­కుం­ది.

వా­యి­దా పడిన 11 ము­న్సి­పా­లి­టీ­ల­లో ఎని­మి­ది చో­ట్ల కాం­గ్రె­స్‌ పా­ర్టీ ప్ర­త్యేక పరి­శీ­ల­కు­ల­ను ని­య­మిం­చిం­ది. రా­ష్ట్ర వ్య­వ­హా­రాల ఇన్‌­ఛా­ర్జి మీ­నా­క్షి నట­రా­జ­న్‌ సూ­చ­నల మే­ర­కు ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు పీ­సీ­సీ చీ­ఫ్‌ మహే­ష్‌ కు­మా­ర్‌ గౌ­డ్‌ వె­ల్ల­డిం­చా­రు. ఎన్ని­కల ప్ర­క్రియ పా­ర­ద­ర్శ­కం­గా, సజా­వు­గా సా­గేం­దు­కు పా­ర్టీ తర­ఫున ప్ర­త్యేక అబ్జ­ర్వ­ర్ల­ను ని­య­మిం­చా­మ­ని తె­లి­పా­రు. ఈ అబ్జ­ర్వ­ర్లు స్థా­ని­కం­గా పా­ర్టీ శ్రే­ణు­ల­తో సమ­న్వ­యం చే­సు­కు­ని ఛై­ర్మ­న్‌, వై­స్‌ ఛై­ర్మ­న్‌ల ఎన్ని­క­లు సా­ఫీ­గా జరి­గే­లా చర్య­లు తీ­సు­కుం­టా­ర­ని పే­ర్కొ­న్నా­రు. ప్ర­త్యే­కం­గా తొ­ర్రూ­రు ము­న్సి­పా­లి­టీ­కి ఎంపీ రఘు­రాం రె­డ్డి, ఎమ్మె­ల్యే­లు రా­జేం­ద­ర్‌ రె­డ్డి, నా­గ­రా­జు­ల­ను ని­య­మిం­చా­రు. జన­గాం ము­న్సి­పా­లి­టీ­కి బీ­ర్ల ఐల­య్య, గం­డ్ర సత్య­నా­రా­య­ణ­ల­ను బా­ధ్య­త­లు అప్ప­గిం­చా­రు. ఇబ్ర­హీం­ప­ట్నం ము­న్సి­పా­లి­టీ­కి ఎమ్మె­ల్యే­లు బాలు నా­య­క్‌, వీ­ర్ల­ప­ల్లి శం­క­ర్‌­ను అబ్జ­ర్వ­ర్లు­గా ని­య­మిం­చా­రు. క్యా­త­న్‌­ప­ల్లి ము­న్సి­పా­లి­టీ­కి మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌, ఎమ్మె­ల్యే కవ్వం­ప­ల్లి సత్య­నా­రా­య­ణ­ల­ను ఎం­పిక చే­శా­రు. ఖా­నా­పూ­ర్‌ ము­న్సి­పా­లి­టీ­కి ప్ర­భు­త్వ వి­ప్‌ ఆది శ్రీ­ని­వా­స్‌, ఎమ్మె­ల్యే భూ­ప­తి­రె­డ్డి­ల­ను బా­ధ్య­త­లు అప్ప­గిం­చా­రు. ఇం­ద్రే­శం ము­న్సి­పా­లి­టీ­కి ఎమ్మె­ల్యే­లు పి. రా­మ్మో­హ­న్‌ రె­డ్డి, శ్రీ గణే­ష్‌­ల­ను ని­య­మిం­చా­రు.

Tags

Next Story