TG: తెలంగాణలో తగ్గిన నేరాల సంఖ్య: డీజీపీ

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను ఆయనఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది 2,34,158 కేసులు నమోదు అయితే 2025 సంవత్సరంలో 2.28,69 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బీఎన్ఎస్ కేసులు 2024 లో 1,69,477 నమోదు అయితే 2025లో 1,67,018 కేసులు నమోదు అయ్యాయని ఇవి గతేడాదితో పోలిస్తే 1.45 శాతం తగ్గినట్లు తెలంగాణ డీజీపీ వెల్లడించారు.
గతేడాది 2 లక్షలకుపైగా కేసులు
గతేడాది 2,34,158 కేసులు నమోదు అయితే 2025 సంవత్సరంలో 2.28,69 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బీఎన్ఎస్ కేసులు 2024 లో 1,69,477 నమోదు అయితే 2025లో 1,67,018 కేసులు నమోదు అయ్యాయని ఇవి గతేడాదితో పోలిస్తే 1.45 శాతం తగ్గిందని తెలిపారు. నేర నిరూపణ శాతం 3.09 శాతం పెరిగిందని ఇది గతేడాది 35.63 శాతం ఉంటే ఈ ఏడాది 38.72 శాతం ఉందని తెలిపారు. ఈ ఏడాది నాలుగు కేసుల్లో మరణశిక్ష విధించబడిందన్నారు. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ శిక్ష పడిందని చెప్పారు. పోక్సో చట్టం కింద నమోదైన మొత్తం 141 కేసుల్లో ఈ ఏడాది 154 మంది నిందితులకు జీవిత ఖైదు విధించబడిందని, 3 కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడిందంని తెలిపారు. ఎస్సీ ఎస్టీ చట్టం 28 కేసుల్లో 53 మంది నిందితులకు జీవిత ఖైతు విధించబడిందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు, మిస్ వరల్డ్ పోటీలు, ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ ప్రోగ్రామ్, వరదలు వంటి విపత్తులను ముఖ్యమైన ఈవెంట్లను తెలంగాణ పోలీస్ సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పారు. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని అందులో 23 మంది తెలంగాణ మావోలు ఉన్నారని డీజీపీ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

