TG: యమపాశాలుగా విద్యుత్ తీగలు

TG: యమపాశాలుగా విద్యుత్ తీగలు
X
10 ప్రాణాలు బలిగొన్న విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం... రామాంతపూర్‌లో శోభాయాత్రలో ఆరుగురు దుర్మరణం

మూడు రో­జుల వ్య­వ­ధి­లో హై­ద­రా­బా­ద్‌­లో జరి­గిన మూడు వి­షాద ఘట­న­ల్లో 10 మంది అమా­య­కు­లు ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. యు­వ­కు­లే ఎక్కు­వ­గా ప్రా­ణా­లు కో­ల్పో­వ­డం కు­టుం­బా­ల­లో తీ­వ్ర వి­షా­దం నిం­పిం­ది. రా­మం­తా­పూ­ర్ గో­ఖ­లే నగర్ లో ఆది­వా­రం కృ­ష్ణా­ష్ట­మి సం­ద­ర్భం­గా రో­జం­తా వే­డు­క­ల్లో ఉత్సా­హం­గా పా­ల్గొ­న్న యు­వ­కు­లు...రా­త్రి రథం­పై ఊరే­గిం­పు ని­ర్వ­హిం­చా­రు.. సం­ద­డి­గా కొ­న­సా­గిన శో­భా­యా­త్ర­లో పె­ద్ద­సం­ఖ్య­లో భక్తు­లు కూడా పా­ల్గొ­న్నా­రు. అయి­తే యా­త్ర చి­వ­రి­లో వి­ద్యు­త్ తీ­గ­ల­కు ని­ర్ల­క్ష్యం­గా తగి­లిం­చి ఉన్న కొ­క్కెం లాం­టి మరో తీగ రథా­ని­కి తగ­ల­డం­తో రథ­మం­తా వి­ద్యు­త్ ప్ర­కం­ప­న­లు వ్యా­పిం­చా­యి.. రథా­న్ని నడి­పి­స్తు­న్న వా­రి­లో ఐదు­గు­రు మృ­తి­చెం­ద­గా నలు­గు­రు తీ­వ్రం­గా గా­య­ప­డ్డా­రు. గా­య­ప­డిన వా­రి­లో కూడా ఒక యు­వ­కు­డు హా­స్పి­ట­ల్ లో చి­కి­త్స పొం­దు­తూ మృతి చెం­దా­డు.. మొ­త్తం­గా ఈ ఘట­న­లో ఇప్ప­టి­వ­ర­కు ఆరు­గు­రు మృ­త్యు­వాత పడ్డా­రు. బం­డ్ల­గూ­డ­లో వి­నా­యక వి­గ్ర­హం తర­లి­స్తుం­డ­గా ప్ర­మా­దం చో­టు­చే­సు­కుం­ది. చాం­ద్రా­య­ణ­గు­ట్ట నుం­చి పు­రా­నా­పూ­ల్‌ వరకు గణే­ష్ వి­గ్ర­హా­న్ని ట్రా­క్ట­ర్ పై తర­లి­స్తుం­డ­గా బం­డ్ల­గూడ వద్ద ట్రా­క్ట­ర్‌­కు వే­లా­డు­తు­న్న­ట్లు­గా ఉన్న కరెం­టు‌ తీ­గ­లు తగి­లి వి­ద్యు­దా­ఘా­తం చో­టు­చే­సు­కుం­ది. ఈ ప్ర­మా­దం­లో ట్రా­క్ట­ర్ పైన కూ­ర్చు­న్న ము­గ్గు­రు యు­వ­కు­లు మర­ణిం­చా­రు. మరో దు­ర్ఘ­టన అం­బ­ర్‌­పే­ట­లో జరి­గిం­ది. గణే­ష్ మం­డ­పం ఏర్పా­టు లో భా­గం­గా కా­స్త అడ్డు­గా ఉన్న వి­ద్యు­త్ వై­ర్ల­ను కర్ర­తో పైకి లే­ప­డా­ని­కి రామ్ చరణ్ అనే యు­వ­కు­డు ప్ర­య­త్నిం­చా­డు. కర్ర నుం­డి పట్టు­త­ప్పి యు­వ­కు­డి చే­తి­కి తగి­లా­యి. దీం­తో వి­ద్యు­త్ షాక్ తగి­లి కింద పడి­పో­యిన రామ్ చరణ్ తీ­వ్ర­గా­యా­ల­తో హా­స్పి­ట­ల్ లో మృతి చెం­దా­డు.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేనా..?

ని­త్యం కు­రు­స్తు­న్న వర్షా­ల­తో నేల తడి­గా ఉం­టోం­ది. వి­ద్యు­త్ తీ­గ­లు ఎలాం­టి రక్షణ లే­కుం­డా ఉం­టు­న్నా­యి. ఆ తీ­గ­ల­కు ఏదై­నా తగి­లిన వెం­ట­నే తడి వల్ల మొ­త్తం వా­హ­నా­ని­కి కూడా వి­ద్యు­త్ సర­ఫ­రా జరి­గి ఘోరం జరు­గు­తోం­ది. తీ­గ­లు ప్ర­మా­ద­క­రం­గా ఉన్న­చోట చర్య­లు చే­ప­ట్ట­డం.. వర్షాల వేళ.. ప్ర­మా­దా­లు సం­భ­వి­స్తా­య­ని హె­చ్చ­రిం­చ­డం.. ప్ర­జ­ల­ను అప్ర­మ­త్తం చేసే బా­ధ్య­త­ను అధి­కా­రు­లు వి­స్మ­రిం­చ­డం వల్లే...ప్ర­మా­దా­లు జరుగుతు­న్నా­య­న్న ఆరో­ప­ణ­లు ఉన్నా­యి.

మా నిర్లక్ష్యం లేదు: ఎస్ఈ

వి­ద్యు­త్‌­శాఖ ని­ర్ల­క్ష్యం­తో చని­పో­యి­న­ట్లు ఆన­వా­ళ్లు లే­వ­ని ఎస్‌ఈ శ్రీ­రా­మ్‌­మో­హ­న్‌ తె­లి­పా­రు. బం­డ్ల­గూ­డ­లో­ని సం­ఘ­టన స్థ­లి­ని ఆయన పరి­శీ­లిం­చా­రు. వి­ద్యు­త్‌­శాఖ ని­ర్ల­క్ష్యం­తో ఇద్ద­రు చని­పో­యి­న­ట్లు తప్పు­డు ప్ర­చా­రం జరు­గు­తోం­ద­ని అన్నా­రు. ట్రా­లీ­పై ఉన్న వ్య­క్తు­లు కిం­ద­ప­డి తీ­వ్ర­గా­యా­లై ప్రా­ణా­లు కో­ల్పో­యి­న­ట్లు చె­ప్పా­రు. ఘట­న­పై మరింత లో­తు­గా దర్యా­ప్తు చే­స్తు­న్న­ట్లు తె­లి­పా­రు.

Tags

Next Story