TG: తెలంగాణలో అద్భుతమైన క్రీడాపాలసీ

తెలంగాణ నుంచి అనేకమంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లారని మంత్రి అజారుద్దీన్ అన్నారు. గోపీచంద్ అకాడమీ నుంచి అనేక మంది వచ్చారని క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకం అన్నారు. ఫుట్ బాల్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ అంశంపై చర్చ నిర్వహించారు. దీనిలో మంత్రి అజారుద్దీన్‌తో పాటు క్రీడా ప్రముఖులు అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, అంబటి రాయుడు, గుత్తా జ్వాల పాల్గొన్నారు. ఈ చర్చలో మాట్లాడిన అజారుద్దీన్.. పీవీ సింధు, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల మంచి పేరు తెచ్చుకున్నారని క్రీడాకారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాపాలసీతో అనేక ఉపయోగాలు ఉన్నాయని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అండదండలు అవసరం అన్నారు. క్రీడాకారులకు ఆర్థిక సాయం, మంచి ఉద్యోగం ఇవ్వాలన్నారు.
ప్రోత్సాహం ఇస్తాం
‘‘క్రీడాకారులూ.. మేమంతా మీపైనే ఆశలు పెట్టుకున్నాం. ఆటనే దైవంగా భావించి ఆడండి. ప్రపంచం మీ వైపు చూస్తోంది’’ అని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన క్రీడా పాలసీ తీసుకువచ్చిందన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ -2047లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ప్యానెల్ డిస్కషన్లో వాకిటి శ్రీహరి, మంత్రి అజారుద్దీన్‌లతో పాటు, క్రీడాకారులు పీవీ సింధు, గుత్తా జ్వాల, గోపీచంద్, అంబటి రాయుడు, అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని పీవీ సింధు అన్నారు.
మౌలిక వసతులు, కోచ్‌లు చాలా కీలకమని చెప్పారు. ప్రతి దశలోనూ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమన్నారు. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ నుంచి సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ వంటి అనేకమంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు. గోపీచంద్ అకాడమీ నుంచి అనేకమంది వచ్చారు. క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకం. ఫుట్‌బాల్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ప్రోత్సాహం అవసరం: పీవీ సింధు
ఈ చర్చలో పీవీ సింధు మాట్లాడుతూ క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని పీవీ సింధు అన్నారు. మౌలిక వసతులు, కోచ్‌లు చాలా కీలకమని చెప్పారు. ప్రతి దశలోనూ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని రాబోయే సంవత్సరాలు తెలంగాణ క్రీడాకారులకు ఎంతో ఆశాజనకంగా ఉండబోతున్నాయన్నారు. పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ హైదరాబాద్ దేశంలోనే ఉత్తమ నగరాలలో ఒకటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 నిజంగా అద్భుతమైనదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

