TG: మాజీ మంత్రి హరీశ్‌రావుకు పితృవియోగం

TG: మాజీ మంత్రి హరీశ్‌రావుకు పితృవియోగం
X
సీఎం రేవంత్, కేసీఆర్ నివాళులు

మాజీ మంత్రి, బీ‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇంట విషాదం నెలకొంది. హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు.

రేవంత్, కేసీఆర్ సంతాపం..

మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థింస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరికాసేపట్లో సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు.

నివాళులు అర్పించిన మాగంటి సునీత

మాజీ మంత్రి, బీ‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని క్రిన్స్ విల్లాస్‌లో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. తాజాగా జూబ్లీహిల్స్ బీ‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత.. సత్యనారాయణ పార్థివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానూభూతి తెలిపారు.

Tags

Next Story