TG HC: డ్రంకెన్ డ్రైవ్లపై హైకోర్టు కీలక తీర్పు

మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను పోలీసులు తనిఖీ చేస్తుంటారు. ఇందులో భాగంగా బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ సంస్థలు నిర్ణయించిన మోతాదు కంటే ఎక్కువగా సేవించినట్లయితే ఆ వాహనదారుడు లేదా డ్రైవర్ పై కేసు నమోదు చేస్తుంటారు. తాజాగా మందుబాబులపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తిపై బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించి అతను మద్యం తాగాడని నిర్థారించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కేవలం బ్రీత్ అనలైజర్ టెస్టుతోనే ఫలానా వ్యక్తి మద్యం తాగాడని కేసు నమోదు చేయడం సబబు కాదని వ్యాఖ్యానించింది. అది కేవలం ప్రాథమిక నిర్థారణ కోసమే అని పేర్కొంది. ఆ తర్వాత యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టులు నిర్వహించి అక్కడ వచ్చిన ఫలితం ఆధారంగా వ్యక్తి మద్యం సేవించాడా లేదా అనేది నిర్థారించాలని కోర్టు స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా మధిరికు చెందిన వెంకటి అనే వ్యక్తి మధిర టీజీఎస్ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే తాను మద్యం సేవించాడన్న కారణంగా అతన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విధుల నుంచి డిస్మిస్ చేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని ధర్మాసనం విచారించింది.
బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టులు చేయకుండా కేవలం బ్రీత్ అనలైజర్ టెస్టుతో ఒక వ్యక్తి మద్యం సేవించారని నిర్థారించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. బ్రీత్ అనలైజర్ టెస్టు ద్వారా మద్యం తాగాడని నిర్థారిస్తూ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం సబబు కాదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

