TG: వైరస్ పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

TG: వైరస్ పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
X
హెచ్చరించిన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హ్యుమన్ మెటా న్యూమో వైరస్ కొత్త వైరస్ కాదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని తెలిపారు. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు. వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. చైనా కొత్త వైరస్ పై నెగెటివ్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజనర్సింహ హెచ్చరించారు. హెచ్ఎంపీవీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 2001లోనే కనుగొన్న HMPV వైరస్‌ శ్వాసకోస వ్యవస్థపై వైరస్‌ స్వల్ప ప్రభావం చూపుతుందని, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అనవసర భయాలు అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే చాలన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.

భయపడొద్దు.. అప్రమత్తంగా ఉన్నాం: కేంద్రం

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు కలవరపెడుతోన్న వేళ కేంద్ర ఆరోగ్యమంత్రి జె. పి. నడ్డా కీలక ప్రకటన చేశారు. ఈ వైరస్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. HMPV వైరస్‌పై కీలక ప్రకటన చేశామని.. దీనిపై అప్రమత్తంగా ఉన్నామని... ఈ వైరస్ కొత్తది కాదని.. 2001లోనే గుర్తించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

ప్రపంచవ్యాప్తంగా హ్యుమన్ మెటానిమోవైరస్ వైరస్ కలకలం రేపుతోంది. పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 12 శాతం వరకూ ఇదే కారణమవుతోంది. ఎవరైనా దగ్గినా, తుమ్మినా నోరు, ముక్కు కప్పి ఉంచుకోవాలని.. తరచూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. వాడిన టిష్యూ తిరిగి ఉపయోగించొద్దని.. రుమాలు, తువ్వాలు షేర్ చేసుకోవద్దని పేర్కొంది. వైరస్ లక్షణాలున్న వారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది.

Tags

Next Story