TG: రేపటి నుంచే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ

TG: రేపటి నుంచే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ
X
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల.. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణలు ప్రారంభం

పా­ర్టీ ఫి­రా­యిం­పు ఆరో­ప­ణ­లు ఎదు­ర్కొం­టు­న్న ఎమ్మె­ల్యే అన­ర్హత పి­టి­ష­న్ల వి­చా­రణ షె­డ్యూ­ల్ ను తె­లం­గాణ అసెం­బ్లీ సె­క్ర­ట­రీ జారీ చే­శా­రు. సె­ప్టెం­బ­ర్‌ 29(సో­మ­వా­రం) ఉదయం 11 గం­ట­ల­కు వి­చా­ర­ణ­లు ప్రా­రం­భం కా­ను­న్నా­యి. 29తే­దీన వి­చా­ర­ణ­కు కల్వ­కుం­ట్ల సం­జ­య్‌ వర్సె­స్‌ టి. ప్ర­కా­శ్‌ గౌడ్, చింత ప్ర­భా­క­ర్ వర్సె­స్‌ కాలే యా­ద­య్య,చింత ప్ర­భా­క­ర్ వర్సె­స్‌ గు­డెం మహి­పా­ల్‌ రె­డ్డి, పల్లా రా­జే­శ్వ­ర్ రె­డ్డి వర్సె­స్‌ బం­డ్ల కృ­ష్ణ­మో­హ­న్‌ రె­డ్డి­లు హా­జ­రు­కా­వా­ల్సి ఉం­టుం­ది. అక్టో­బ­ర్‌ 1 (బు­ధ­వా­రం) మరో­సా­రి అదే కే­సు­ల­పై వారు మరో­సా­రి వి­చా­ర­ణ­కు హా­జ­రు­కా­ను­న్నా­రు. వి­చా­రణ సం­ద­ర్భం­గా పి­టి­ష­న­ర్లు, ప్ర­తి­వా­దుల తర­ఫున న్యా­య­వా­దు­లు..ప్ర­త్య­క్ష వా­ద­న­లు వి­ని­పిం­చ­ను­న్నా­రు. అన­ర్హత పి­టి­ష­న్ల­పై అసెం­బ్లీ స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ కు­మా­ర్ వి­చా­రణ చే­య­ను­న్నా­రు.

అయి­తే, అన­ర్హత పి­టి­ష­న్ల­పై ఎల్లుం­డి నుం­చి అసెం­బ్లీ స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ కు­మా­ర్ వి­చా­రణ చే­య­ను­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా క్రా­స్‌ ఎగ్జా­మి­నే­ష­న్‌ దశలో న్యా­య­వా­దు­లు కీలక వా­ద­న­లు వి­ని­పిం­చ­ను­న్నా­రు. అక్టో­బ­ర్‌ 1 (బు­ధ­వా­రం)వ తే­దీన మరో­సా­రి అదే కే­సు­ల­పై వి­చా­ర­ణ­లు కొ­న­సా­గ­ను­న్నా­యి. పి­టి­ష­న­ర్లు, ప్ర­తి­వా­దుల తర­ఫున న్యా­య­వా­దు­లు ప్ర­త్య­క్ష వా­ద­న­లు వి­ని­పి­స్తా­రు. స్పీ­క­ర్‌/చై­ర్మ­న్‌ ఆధ్వ­ర్యం­లో 10 షె­డ్యూ­ల్‌ ప్ర­కా­రం వి­చా­రణ జర­ప­ను­న్నా­రు. స్పీ­క­ర్‌ ఇచ్చిన నో­టీ­సు­ల­కు సమా­ధా­న­మి­చ్చేం­దు­కు ఈ నెల 30వ తేదీ వరకు గడు­వు ఇవ్వా­ల­ని ఈ సం­ద­ర్భం­గా ఎమ్మె­ల్యే కడి­యం శ్రీ­హ­రి స్పీ­క­ర్‌­ను కో­రి­న­ట్టు సమా­చా­రం.

ఇదీ నేపథ్యం

బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ నుం­చి 10మంది ఎమ్మె­ల్యే­లు కాం­గ్రె­స్ పా­ర్టీ­లో చే­రిన వి­వా­దం­లో వా­రి­పై అన­ర్హత వేటు వే­యా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్ స్పీ­క­ర్ కు ఫి­ర్యా­దు చే­సిం­ది. అన­ర్హ­త­పై స్పీ­క­ర్ కు ఆదే­శా­లి­వ్వా­లం­టూ సు­ప్రీం­కో­ర్టు­ను ఆశ్ర­యిం­చిం­ది. ఈ కే­సు­ను వి­చా­రిం­చిన సు­ప్రీం­కో­ర్టు అన­ర్హత పి­టి­ష­న్ల­పై మూడు నె­ల­ల్లో­గా ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని అసెం­బ్లీ స్పీ­క­ర్‌­ను ఆదే­శిం­చిం­ది. ఏళ్ల తర­బ­డి పి­టి­ష­న్ల­ను పెం­డిం­గ్‌­లో పె­ట్ట­డం సరి­కా­ద­ని ధర్మా­స­నం అభి­ప్రా­య­ప­డిం­ది. చీఫ్ జస్టి­స్ బీ.ఆర్. గవా­య్, జస్టి­స్ అగ­స్టీ­న్ జా­ర్జ్ మసి­హ్ ధర్మా­స­నం జూలై 31న ఈ తీ­ర్పు వె­లు­వ­రిం­చిం­ది. న్యా­య­స్థా­న­మే వేటు వే­యా­ల­ని పి­టి­ష­న­ర్ల వి­జ్ఞ­ప్తి­ని ధర్మా­స­నం తో­సి­పు­చ్చిం­ది. ఇప్పు­డు ఎమ్మె­ల్యే అన­ర్హత షె­డ్యూ­ల్ వి­డు­దల కా­వ­డం­తో తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో మళ్లీ ఉత్కంఠ నె­ల­కొం­ది.

Tags

Next Story